న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రికార్డ్: 138ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం.. తెలుసుకోండి

By Srinivas

అడిలైడ్: ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ క్రికెట్ జట్లు రేపు (నవంబర్ 27న) చరిత్ర లిఖించనున్నాయి. అడిలైడ్ ఓవల్లో ఆ రెండు జట్లు ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో లేని విధంగా తొలిసారి 'డే అండ్ నైట్' టెస్ట్ మ్యాచ్ అడనున్నాయి. ఇది రేపు ప్రారంభం కానుంది.

అలాగే, క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారిగా గులాబీ రంగు బంతులతో టెస్టు మ్యాచ్‌ ఆడనున్నారు. ఇందు కోసం క్రికెటర్లు బంతికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నారు. అడిలైడ్‌ మైదానంలో గురువారం ఆస్ట్రేలియా క్రికెటర్లు నెట్‌ సెషన్‌లో ఆ బంతులతో ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశారు.

ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గులాబీ బంతులను సహచరులపైకి సరదాగా విసురుతూ సెషన్‌లో సందడి చేశాడు. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్‌ మధ్య శుక్రవారం ఆరంభంకానున్న డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌లో గులాబీ రంగు బంతిని తొలిసారిగా వినియోగించనున్నారు.

All you need to know about first-ever day-night Test

కాగా, 138 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ డే అండ్ నైట్ మ్యాచ్ జరగలేదు. కానీ తొలిసారి ఇప్పుడు జరుగుతోంది. దీంతో ముందు టీ, తర్వాత భోజన విరామం రానుంది. సాధారణంగా, టెస్ట్ మ్యాచుల సమయంలో తొలుత భోజన విరామం, తర్వాత టీ విరామం వస్తుంది.

టెస్టులు ఎప్పుడు డేలలోనే జరిగాయి. కాబట్టి అలా వచ్చేది. ఇప్పుడు రేపు జరగబోయే టెస్ట్ డే అండ్ నైట్ కాబట్టి.. తొలుత టీ వస్తుంది. ఆ తర్వాత భోజన విరామం రానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు గంటల ఇరవై నిమిషాలకు టీ విరామం ఇస్తారు.

తర్వాత రెండో సెషన్ మొదలై... సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ముగుస్తుంది. నలభై నిమిషాల భోజన విరామం తర్వాత 7 గంటల నుంచి 9 గంటల మధ్య చివరి సెషన్ జరుగుతుంది. ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి 7 గంటల వరకు నలభై నిమిషాల పాటు భోజన విరామం ఉంటుంది. క్రికెట్ చరిత్రలో తొలి అంతర్జాతీయ డే అండ్ నైట్ మ్యాచ్ ఇదే.

ఎప్పుడు, ఎక్కడ?

క్రికెట్ చరిత్రలో ఈ తొలి టెస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్‌కు వేదిక అడిలైడ్ ఓవల్ మైదానం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఈ టెస్ట్ జరగనుంది. చాపల్ - హాడ్లీ సిరీస్ యొక్క మూడో (తుది) టెస్ట్ ఇది. ఆస్ట్రేలియా 1-0తో లీడ్‌లో ఉంది. రెండో టెస్ట్ డ్రా అయింది.

డే అండ్ నైట్ ఎందుకు?

డే అండ్ నైట్ మ్యాచుల ద్వారా టెస్ట్ సిరీస్‌లకు ప్రేక్షకులను పెద్ద ఎత్తున రప్పించాలని ఆలోచిస్తున్నారు. తద్వారా టెస్టులకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. డే అండ్ నైట్ టెస్టులను భారత్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సమర్థించాడు.

ఎప్పుడు డై అండ్ నైట్ టెస్టులకు ఓకే చెప్పారు?

అక్టోబర్ 30, 2012లో ఐసీసీ డే అండ్ నైట్ టెస్టులకు పచ్చ జెండా ఊపింది. అలాగే, రంగుల బంతులు ఉపయోగించేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ జూన్ నెలలో ఆస్ట్రేలియా - న్యూజిలాండులు డే అండ్ నైట్ టెస్ట్ సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించాయి.

138 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు అన్ని జట్లు 2189 టెస్టులు ఆడాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా - భారత్ 2189వ టెస్ట్ ఆడుతోంది. ఇప్పుడు న్యూజిలాండ్ - ఆస్ట్రేలియాది 2190వ టెస్ట్. ఈ టెస్టులో గులాబీ బంతిని ఉపయోగిస్తారు.

స్క్వాడ్

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, జో బర్న్స్, జోష్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, పీటర్ నేవెల్ (వికెట్ కీపర్), జేమ్స్ పాటిన్సన్, మిచెల్ స్టార్క్, పీటర్ సిడిల్, అడమ్ వోగ్స్

న్యూజిలాండ్: బ్రెడన్ మెకలమ్ (కెప్టెన్), గుప్తిల్, టామ్ లాథమ్, విలియమ్సన్, రాస్ టేలర్, వాట్లింగ్ (వికెట్ కీపర్), మిచెల్ సాంచనర్, బ్రాస్ వెల్, హెన్రీ, వాంగర్, టిమ్ సోథీ, ట్రెంట్ బౌల్ట్, మార్క్ క్రెయిగ్, రోంచి (వికెట్ కీపర్), మిచెల్ మెక్లెనగన్

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X