ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీఫైన‌ల్స్‌పై మెగాస్టార్ క్రియేటివ్ ట్వీట్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ స్టేజీ సమరం ముగిసింది. గ్రూప్ ఏ నుంచి ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లు సెమీస్‌కు చేరగా గ్రూప్ బీ నుంచి ఇండియా, పాకిస్థాన్‌లు సెమీకు చేరుకున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ చాంపియ‌న్స్ ట్రోఫీలో సెమీఫైన‌ల్ చేరిన జట్ల గురించి ఓ క్రియేటివ్ ట్వీట్ చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ నాలుగు దేశాలపై తనదైన శైలిలో ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. సెమీస్‌కు చేరిన జట్లలో ఇండియాతో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ మినహాయించి మిగతా మూడు దేశాలు ఆసియాకు చెందినవి. అంతేకాదు 1947లో దేశ విభ‌జ‌న‌కు ముందు అఖండ భార‌తదేశంలో ఉన్నాయి.

Amitabh Bachchan’s creative summary of ICC Champions Trophy semi-finalists

అయితే నాలుగో దేశమైన ఇంగ్లాండ్ ఈ మూడింటినీ పాలించింది. దీనిని గుర్తు చేస్తూ అమితాబ్ చేసిన ట్వీట్ ఆక‌ట్టుకుంటోంది. అఖండ భారతాన్ని అప్పుడు ఇంగ్లాండ్ రూల్ చేసినా.. ఇప్పుడు టోర్నీలో ఎవ‌రు రూల్ చేస్తారో చూడాల‌ని అమితాబ్ ట్వీట్ చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bollywood’s legendary actor Amitabh Bachchan was at his creative best on Tuesday to mark the ICC Champions Trophy semi-finals line-up.
Please Wait while comments are loading...