కోహ్లీ.. కుంబ్లేతో సర్దుకుపో!: బీసీసీఐ కొత్త రాగం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ప్రస్తుత కోచ్‌‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించాలా? లేక మరొకరిని ఎంపిక చేయాలా? అనే విషయమై గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మరికొంత సమయం కావాలని కోరింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

కోచ్‌ ఎంపికపై గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ గురువారం సాయంత్రం సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపింది. అయితే ఈ విషయంలో స్పష్టత కోసం తమకు మరింత సమయం కావాలని బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రిని కమిటీ కోరింది.

'సీనియర్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక కోసం సీఏసీ గురువారం సమావేశమైంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుని తిరిగి బీసీసీఐకి తెలుపుతుంది' అని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు. దీంతో కుంబ్లేతో మరికొంత కాలం సర్దుకుపోవాలని కెప్టెన్‌ కోహ్లీకి బీసీసీఐ సూచించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకు కూడా కుంబ్లేనే కోచ్‌గా వెళ్లనున్నాడు. 'వెస్టిండీస్‌ పర్యటనకు కుంబ్లేనే కోచ్‌గా వెళ్తాడు. అది స్వల్పకాలిక పర్యటన. కాబట్టి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కొత్త కోచ్‌ ఎంపికపై నిర్ణయం తీసుకునేవరకు కుంబ్లేతో సర్దుకుపోవాలని కోహ్లికి సూచించాం' అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ

తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా లేఖ

మరోవైపు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లాలతో పాటు చాలా మంది సీనియర్‌ అధికారులు కుంబ్లే వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో కుంబ్లేనే కొనసాగిస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జూలైలో కోచ్‌గా కుంబ్లే బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ముగియనున్న కుంబ్లే పదవీ కాలం

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ముగియనున్న కుంబ్లే పదవీ కాలం

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కుంబ్లే కోచ్ పదవీ కాలం ముగియనుంది. అయితే కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా 17 టెస్టుల్లో 12 విజయాలను సొంతం చేసుకుంది. టీమిండియాకు వరుస విజయాలనందించిన కుంబ్లేను పక్కనపెట్టేందుకు సీఏసీ కూడా విముఖంగానే ఉంది.

జూన్ 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)

జూన్ 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)

మరోవైపు జూన్ 26న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరిగే వరకు కోచ్‌ వ్యవహారాన్ని వాయిదా వేయాలని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కుంబ్లే అటునుంచి అటే విండీస్‌ పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలుంటాయి.

కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌

కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌

ఒకవేళ కుంబ్లే వెళ్లకుంటే సహాయక కోచ్‌ సంజయ్‌ బంగర్‌ జట్టుతో పాటు వెళతారు. నిజానికి కెప్టెన్‌ కోహ్లీ చెప్పాడని కుంబ్లేను మారిస్తే బోర్డు పరిపాలక వ్యవహారాల్లోనూ తన అభిప్రాయానికి విలువ ఉంటుందనే సంకేతాలు పంపించినట్టవుతుందని, ఇది సరైన నిర్ణయం కాదని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పిన సీఓఏ

తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పిన సీఓఏ

మరోవైపు కోచ్‌ ఎంపిక వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని పరిపాలక కమిటీ (సీఓఏ) తేల్చి చెప్పింది. క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) నిర్ణయాన్ని తాము వ్యతిరేకించలేమని, మా నుంచి ఎలాంటి జోక్యం ఉండదని స్పష్టం చేసింది. ఏదైనా సీఏసీ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anil Kumble is set to continue as India's head coach after the ICC Champions Trophy 2017, according to reports in the media.
Please Wait while comments are loading...