న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షార్ట్ పిచ్ బంతుల విమర్శపై మురళీ విజయ్‌కి కుంబ్లే కితాబు

ఓపెనర్ మురళీ విజయ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడనే విమర్శను టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కొట్టిపారేశారు.

By Nageshwara Rao

ముంబై: ఓపెనర్ మురళీ విజయ్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతున్నాడనే విమర్శను టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కొట్టిపారేశారు. దానిని బలహీనతగా చూడటం సరైంది కాదని, ప్రస్తుతం జట్టులో అత్యంత నిలకడైన ఆటగాళ్లలో అతనూ ఒకడంటూ కుంబ్లే కితాబిచ్చాడు.

'గత రెండేళ్లుగా మా జట్టులో అత్యంత నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మన్ విజయ్. రాజ్‌కోట్‌లో అతను సెంచరీ కూడా చేశాడు. సిరీస్‌లో ఒకే తరహాలో అవుటైనా, షార్ట్ పిచ్ బంతి అతని బలహీనత కాదు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న విజయ్, త్వరలోనే మరో భారీ ఇన్నింగ్స్ ఆడే సత్తా అతడిలో ఉంది' అని కుంబ్లే చెప్పాడు.

షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొవడంలో

షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొవడంలో

షార్ట్ పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కొవడంలో టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి సలహాలు ఇస్తుందని తెలిపాడు. నెట్స్‌లో మరింత ప్రాక్టీస్ చేసేలా ఏర్పాటు చేస్తాం. ఏదేమైనా అతను పరుగులు చేయడం ముఖ్యం అని కుంబ్లే పేర్కొన్నాడు. మరోవైపు పదే పదే ఓపెనర్లు మారుతున్నా, భారత్ బాగా ఆడుతోందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

లోకేశ్ రాహుల్ మెరుగ్గా రాణిస్తాడు

లోకేశ్ రాహుల్ మెరుగ్గా రాణిస్తాడు

ఆటలో గాయాలు సహజమని, కోలుకున్న లోకేశ్ రాహుల్ మెరుగ్గా రాణిస్తాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మేం కోరుకునేది ఒక్కటే మంచి ఓపెనర్లు ఉండాలని. కానీ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. వాటికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అదృష్టమేమిటంటే కుదురుకున్న ఓపెనర్లు లేకపోయినా జట్టు బాగా ఆడుతుందని అన్నాడు.

నాలుగో టెస్టుకు పార్ధీవ్

నాలుగో టెస్టుకు పార్ధీవ్

మూడో టెస్టుకు జట్టులోకి వచ్చిన పార్థివ్ బాగా ఆడటమే ఇందుకు నిదర్శనం అని కుంబ్లే వెల్లడించాడు. తాను ఆడిన రోజులతో పోలిస్తే, తర్వాతి కాలంలో ఫిట్‌నెస్‌పై ఆటగాళ్లకు శ్రద్ధ పెరిగిందని, ఇప్పుడు భారత జట్టు అత్యంత ఫిట్‌గా కనిపిస్తోందని కుంబ్లే అన్నారు. మరోవైపు డీఆర్‌ఎస్ వినియోగంపై తమ ఆటగాళ్లంతా సంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.

మూడు భిన్నమైన ఓపెనింగ్ జంటలు

మూడు భిన్నమైన ఓపెనింగ్ జంటలు

భుజం గాయం నుంచి కోలుకున్న లోకేశ్ రాహుల్ నాలుగో టెస్టుకు అందుబాటులో ఉంటాడని కుంబ్లే తెలిపాడు. నెట్స్‌లో రాహుల్ బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పాడు. కివీస్‌పై మూడు భిన్నమైన ఓపెనింగ్ జంటలను పరిశీలించామని, వెస్టిండిస్‌తో సిరీస్‌కు విజయ్ గాయపడ్డాడు. తర్వాత శిఖర్ ధావన్, గంభీర్ కివీస్ టెస్టులకు దూరమయ్యారు.

గాయాల కారణంగా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో

గాయాల కారణంగా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో

కాబట్టి గాయాల కారణంగా తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. గత రెండు టెస్టుల్లో విజయానికి కారణం బౌలర్లు, కోహ్లీ కెప్టెన్సీ అని కితాబిచ్చాడు. నలుగురు పేసర్లు తమ పాత్రలను సమర్థంగా పోషించారని కుంబ్లే తెలిపాడు. పేసర్లలో ఉమేశ్, షమీల్లో ఎవరు అత్యుత్తమనే అంశంపై స్పందించేందుకు కుంబ్లే నిరాకరించాడు.

 స్పిన్నర్లు అర్ధసెంచరీలు చేయడం సంతృప్తినిచ్చింది

స్పిన్నర్లు అర్ధసెంచరీలు చేయడం సంతృప్తినిచ్చింది

ఇక స్పిన్నర్ల నైపుణ్యంపై మాట్లాడుతూ మేం 150/5 ఉన్న దశలో ముగ్గురు స్పిన్నర్లు అర్ధసెంచరీలు చేయడం సంతృప్తిన్నిచ్చిందని కుంబ్లే అన్నాడు. జిమ్‌ల్లో ఆటగాళ్లపై అధిక ఒత్తిడి తీసుకురావడంతో గాయాలబారిన పడుతున్నారని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేసిన వ్యాఖ్యలను కుంబ్లే ఖండించాడు. అత్యుత్తమ ఫిట్‌నెస్ కావాలంటే ఇది తప్పనిసరి అని స్పష్టం చేశాడు

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X