వేతన బకాయిల కింద అనిల్ కుంబ్లేకి రూ.కోటి చెల్లించిన బీసీసీఐ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేకి వేతన బకాయిల కింద రూ. కోటిని బీసీసీఐ చెల్లించింది. కోహ్లీతో విభేధాల కారణంగా ప్రధాన కోచ్ పదవి నుంచి కుంబ్లేని అవమానకర రీతిలో సాగనంపిన సంగతి తెలిసిందే.

ప్రతీ నెల రూ.25 లక్షలకు మించి చెల్లింపులను బీసీసీఐ తమ అధికారిక వెబ్‌సైట్‌లో చూపిస్తూ ఉంటుంది. మే, జూన్‌లకు సంబంధించి అనిల్ కుంబ్లేకి రూ.48.75 లక్షల చొప్పున ప్రొఫెషనల్‌ ఫీజు చెల్లించినట్టు బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

Anil Kumble gets his dues post acrimonious exit

ఇక పేసర్‌ ఇషాంత్‌ శర్మకు కూడా దాదాపు రూ. కోటి చెల్లించింది. మహిళల ప్రపంచ క్రికెట్‌లో రన్నరప్‌గా నిలిచిన అమ్మాయిలకు రూ.45 లక్షల చొప్పున విడుదల చేయడంతో పాటు మాజీ క్రికెటర్లు వివేక్‌ రజ్దాన్, శరణ్‌దీప్‌ సింగ్, సలీల్‌ అంకోలా, రితిందర్‌ సింగ్‌ సోధి, యోగ్‌రాజ్‌ సింగ్, రాబిన్‌ సింగ్‌లకు వన్‌టైమ్ బెనిఫిట్ కింద రూ.35 లక్షల చొప్పున అందించింది.

India vs Sri Lanka 2017 :Ravi Shastris and Anil Kumbles will come and go

ఈ ఏడాది జూన్‌లో లండన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమి అనంతరం తన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లే రాజీనామాన అనంతరం ఆ పదవికి క్రికెట్ సలహా కమిటీ రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Kumble gets his dues
English summary
Anil Kumble has been paid his dues of close to Rs 1 crore by the BCCI, marking a closure to his acrimonious episode as the head coach of the Indian cricket team. The BCCI made the disclosure on its official website as part of a monthly exercise of publishing payments above Rs 25 lakh.
Please Wait while comments are loading...