సచిన్‌ కుమారుడికి ఏమైంది?: ఊత‌క‌ర్ర‌ల సాయంతో షోకి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అర్జున్ టెండూల్క‌ర్‌.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడిగా అందరికి సుపరిచితం. సచిన్ కొడుకుగానే కాకుండా ఈ మ‌ధ్య సొంతంగానూ మ‌రో పోలిక‌తో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాడు. అర్జున్ టెండూల్కర్ అచ్చం కెనడియన్ పాప్ స్టార్ జ‌స్టిన్ బీబ‌ర్‌లాగే ఉంటాడ‌ని అభిమానులు 'ఇండియన్ జస్టిన్ బీబర్' అంటూ పిలుస్తున్నారు.

అర్జున్ టెండూల్కర్ కూడా జస్టిన్ బీబర్‌కు పెద్ద ఫ్యాన్. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన జస్టిన్ బీబర్ షోకు సైతం హాజరయ్యాడు. అయితే ఈ షోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ని చూసిన అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే అర్జున్ అక్కడికి ఊత కర్రల సాయంతో ఈ షోకి నడుచుకుంటూ వచ్చాడు.

Arjun Tendulkar tries to conceal his identity at Justin Bieber's concert

దీంతో పాటు అర్జున్ ఎడ‌మ కాలికి బ్యాండేజ్‌ కూడా ఉంది. న‌డ‌వ‌డానికి కూడా రాక‌పోవ‌డంతో ఊత‌క‌ర్ర‌ల సాయంతో అత‌ను షోకి రావడంతో అర్జున్‌ టెండూల్కర్‌కి ఏమైంది? అని ప్రస్తుతం అభిమానులను ఓ ప్రశ్న కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే జస్టిన్ బీబర్ షోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన జస్టిన్‌ బీబర్‌ తమను నిరాశపరిచారంటూ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన కన్సర్ట్‌లో కొన్ని పాటలకు బీబర్‌ కేవలం పెదవులు మాత్రమే కదిలించారని, వేలకు వేలు పోసి టిక్కెట్లు కొన్న తమకు బీబర్‌ క్షమాపణ చెప్పాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
International singing sensation, Justin Bieber, who performed in Navi Mumbai at the DY Patil Sports Stadium, was welcomed by close to 45,000 fans on Wednesday evening.
Please Wait while comments are loading...