స్టార్క్‌కు చోటు: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ఆసీస్ జట్టు ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ ఏడాది జూన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 15మంది సభ్యులు గల ఆసీస్‌ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, వైస్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు.

రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో కలిసి ఉంది. టోర్నీలో భాగంగా గ్రూపు ఏలో ఉన్న ఆస్ట్రేలియా జూన్‌ 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

Australia name 15-man squad for Champions Trophy; Mitchell Starc returns

జూన్‌ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్‌లోని వేల్స్‌లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగనుంది. గాయాల బారిన పడి కోలుకున్న ఆసీస్ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌కు జట్టులో క్రికెట్ ఆస్ట్రేలియా చోటు కల్పించింది.

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం భారత పర్యటనకు వచ్చిన సమయంలో మిచెల్‌ స్టార్క్‌ గాయపడ్డాడు. మిచెల్ స్టార్క్‌, పాటిన్‌సన్‌, జాన్‌ హాస్టింగ్స్‌, హాజిల్‌వుడ్‌, కమిన్స్‌తో ఆసీస్ బౌలింగ్‌ విభాగం బలంగా కనిపిస్తోంది.

మరోవైపు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపుడు ఆడుతున్న క్రిస్‌లిన్‌ను కూడా ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో పాల్గొనని ఆటగాళ్లంతా మే 18న ఛాంఫియన్స్‌ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లనున్నారు. ఐపీఎల్‌ టోర్నీ ముగిసిన వెంటనే మిగతా ఆసీస్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ చేరుకోనున్నారు.

ఆస్ట్రేలియా జట్టు:
స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, ప్యాట్ కమ్మిన్స్, అరోన్‌ ఫించ్‌, జాన్‌ హాస్టింగ్స్‌, హాజిల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, మోయిస్‌ హెన్రిక్స్‌, క్రిస్‌లిన్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌, స్టాయినిస్‌, మ్యాథ్యూ వేడ్‌, ఆడమ్ జంపా.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australia today (April 20) named a 15-man squad for ICC Champions Trophy 2017 to be held in England in June. Steve Smith will lead the side while David Warner will be his deputy.
Please Wait while comments are loading...