పోటీ తత్వం పెరిగింది, కష్టంగా ఉంది: క్రికెట్‌కు షాన్ టెయిట్ వీడ్కోలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీర్ఘకాలిక మోచేయి గాయం కారణంగా పూర్తి స్థాయి క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన వయసు పైబడటం కూడా ఇందుకు ఒక కారణంగా షాన్ టెయిట్ చెప్పాడు.

'నిజాయితీగా చెప్పాలంటే నేను ఇంకా కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడాలనుకున్నా. ఇక్కడ(ఆస్ట్రేలియా)లో కానీ, యూకేలో కానీ క్రికెట్ కెరీర్‌ను కొనసాగించాలనుకున్నా. అయితే ప్రస్తుతం క్రికెట్‌లో పోటీ తత్వం బాగా పెరిగింది. యువ క్రికెటర్లు చాలా మందే వచ్చారు. వారితో పోటీ పడటం కాస్త కష్టంగానే ఉంది. అందుచేత క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలనుకున్నా' అని వీడ్కోలు సందర్భంగా టెయిట్ పేర్కొన్నాడు.

Australia quick Shaun Tait announces retirement from internationalcricket

ఆస్ట్రేలియా తరుపున 35 మ్యాచ్‌లాడి 62 వికెట్లు తీశాడు. 2007 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో షాన్ టెయిట్ కీలకపాత్ర పోషించాడు. ఆ ఏడాది వరల్డ్ కప్ 11 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు సాధించి టోర్నమెంట్‌లో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

ఇక 2010లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.1 కిలోమీటర్ల వేగంతో ఫాస్టెస్ బంతిని వేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 2005లో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌తో టెయిట్ తన టెస్టు కెరీర్‌ను ఆరంభించాడు. ఆసీస్ తరుపున కేవలం మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

2016-17 సీజన్‌లో భాగంగా బిగ్ బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడిన టెయిట్ చివరిసారిగా సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించాడు. మరోవైపు భారత్‌తో సిడ్నీలో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ టెయిట్‌కు ఆస్ట్రేలియా తరపున ఆఖరి మ్యాచ్ కావడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Australian fast bowler Shaun Tait on Monday (March 27) announced his retirement from international cricket due to a chronic elbow injury.
Please Wait while comments are loading...