కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌: పోలిక వద్దని చెప్పిన పాక్ యువ క్రికెటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తనకు ఏ మాత్రం పోలిక లేదని పాకిస్థాన్ యువ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ అన్నాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని, తాను ఇంకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నానని అజామ్‌ తన ట్విట్టర్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

సోమవారం ట్విట్టర్‌లో అభిమానులతో అజామ్‌ స్వయంగా ఛాటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని మీ అభిమాన క్రికెటర్ ఎవరని ప్రశ్నించగా ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ, హషీమ్‌ ఆమ్లా అని అన్నాడు.

ఇక తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి తన అంకుల్‌ కారణమని ఆయనతో కలిసి వీధుల్లో క్రికెట్‌ ఆడిన సంఘటనలు ఇంకా గుర్తు ఉన్నాయని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అజామ్‌ సమాధానం ఇచ్చాడు. అనంతరం మరో అభిమాని అజామ్‌ను పాకిస్థాన్‌ కోహ్లీగా పిలవచ్చా అని అడిగాడు.

Babar Azam was asked about Virat Kohli comparison and here's his reaction on Twitter

'మా ఇద్దరి మధ్య పోలిక లేదు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌. నేను ఇంకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నాను. పాకిస్థాన్‌ బాబర్‌ అజామ్‌గా పిలుపించుకోవడమే నాకు ఇష్టం' అని అజామ్‌ పేర్కొన్నాడు.

Kohil, Sarfaraz Pose With ICC Champions Trophy a Day Before Final Match | Oneindia Telugu

ఇదిలా ఉంటే ఇటీవల ఓ క్రికెట్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఎదగాలన్నది తన కోరిక అని తెలిపాడు. జింబాబ్వేపై వన్డేల్లో అరంగేట్రం చేసిన బాబర్ అజామ్ ఈ ఏడాది జనవరిలో అత్యంత వేగంగా వన్డేల్లో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా ఉమ్మడి రికార్డుని సాధించాడు.

పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో 100 బంతుల్లో 84 పరుగులు చేసి ఈ మైలురాయిని అందుకున్నాడు. కేవలం 21 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను సాధించి వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్, జొనాథన్ ట్రోట్, దక్షిణాఫ్రికా డికాక్‌ల సరసన చేరాడు.

22 ఏళ్ల బాబర్ ఆజామ్ ఇప్పటి వరకు పాకిస్థాన్ తరుపున 9 టెస్టులాడి 436 పరుగులు చేయగా, 31 వన్డేల్లో 1455 పరుగులు నమోదు చేశాడు. ఇక 8 టీ20ల్లో 253 పరుగులు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan middle-order batsman Babar Azam has played down his comparison with Indian skipper Virat Kohli, saying there is no similarity between the two.
Please Wait while comments are loading...