భారత్-బంగ్లా మ్యాచ్: రెచ్చిపోయిన బంగ్లా ఫ్యాన్, జాతీయ జెండాకు అవమానం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం ఇండియా-బంగ్లాదేశ్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరగనుంది. అయితే సోషల్‌మీడియాలో మాత్రం అభిమానుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌-బంగ్లా పోరుపై సోషల్‌మీడియాలో అభిమానుల మధ్య వార్‌ మొదలైంది.

అయితే ఈ మ్యాచ్‌కి ముందే బంగ్లాదేశ్‌కు చెందిన ఓ అభిమాని భారత జాతీయ జెండాను అవమానిస్తూ సోషల్ మీడియాలో అభ్యంతకర ట్వీట్ చేశాడు. అతడు పోస్టు చేసిన పోటోషాప్ ఇమేజిలో మన మూడు రంగుల జెండా కుక్కపై కప్పగా, దాని వెనకునే బంగ్లా జాతీయ పతాకం కప్పబడి ఉన్న టైగర్ వెంటాడుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు ఆ జట్టు ఆటగాళ్లను 'టైగర్స్' అని పిలుచుకోవడం మనకు తెలిసిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు  | స్కోరు కార్డు

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా 'Bangladesh Cricket: The Tigers' అని రాసి ఉంటుంది. అయితే ఆ బంగ్లా అభిమాని తన ఫోటోషాప్ ఇమేజి ద్వారా ఏం చెప్పదలచుకున్నాడంటే భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఓ గొప్ప మ్యాచ్‌గా నిలుస్తందని అతడి ఉద్దేశం కాబోలు.

లీగ్‌లో వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దవ్వడం కలిసొచ్చిన బంగ్లా... ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అనూహ్యంగా విజయం సాధించి సెమీఫైనల్‌కి అర్హత సాధించింది. ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

ఇక బంగ్లాదేశ్ మొట్టమొదటి సారి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ పైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్. అయితే బంగ్లాదేశ్ అభిమానులు టీమిండియా పట్ల ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మొదట్లో బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మాద్ అప్పటి పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తలని చేతిలో పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో సంచలనం అయింది.

ఈ ఫోటో 2016లో ఆసియా కప్‌ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. ఇక 2015 వరల్డ్ కప్ సమయంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ టీమిండియా ఆటగాళ్లకు అరగుండు కొట్టించినట్లుగా ఉన్న పోటోను ఆ దేశ న్యూస్ పేపర్ ప్రచురించిన సంగతి తెలిసిందే.

ఫోటో షాప్‌లో చేసిన ఇమేజి ఇలా

ఫోటో షాప్‌లో చేసిన ఇమేజి ఇలా

పోటోషాప్ ఇమేజిలో మన మూడు రంగుల జెండా కుక్కపై కప్పగా, దాని వెనకునే బంగ్లా జాతీయ పతాకం కప్పబడి ఉన్న టైగర్ వెంటాడుతూ ఉంటుంది. బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు ఆ జట్టు ఆటగాళ్లను 'టైగర్స్' అని పిలుచుకోవడం మనకు తెలిసిందే.

ఆసియా కప్ సమయంలో ఇలా

ఆసియా కప్ సమయంలో ఇలా

బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మాద్ అప్పటి పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తలని చేతిలో పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

టీమిండియాకే అవమానం

టీమిండియాకే అవమానం

2015 వరల్డ్ కప్ సమయంలో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ టీమిండియా ఆటగాళ్లకు అరగుండు కొట్టించినట్లుగా ఉన్న ఫోటోను ఆ దేశ న్యూస్ పేపర్ ప్రచురించిన సంగతి తెలిసిందే.

టీమిండియా అభిమాని సుధీర్‌పై బంగ్లా అభిమానుల దాడి

టీమిండియా అభిమాని సుధీర్‌పై బంగ్లా అభిమానుల దాడి

జూన్ 21, 2015లో సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని అయిన సుధీర్ గౌతమ్‌పై బంగ్లాదేశ్ అభిమానులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ahead of the India-Bangladesh clash in the semi-finals of the ongoing Champions Trophy an over enthusiastic Bangladeshi fan has insulted the Indian National Flag on social media.
Please Wait while comments are loading...