న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100వ టెస్టు: బంగ్లాదేశ్ బరిలో నిలుస్తుందా?

టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే బంగ్లాదేశ్ జట్టు ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా ఆ జట్టు విజయాలను సాధించడంలో వెనుకబడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక పర్యట

By Nageshwara Rao

హైదరాబాద్: టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే బంగ్లాదేశ్ జట్టు ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా ఆ జట్టు విజయాలను సాధించడంలో వెనుకబడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు లంకకు వెళ్లిన బంగ్లాదేశ్ గాలేలో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైంది.

ఈ ఓటమి బంగ్లాదేశ్‌కు 76 టెస్టు ఓటమి కాగా, వరుసగా నాలుగోది కావడం విశేషం. బుధవారం నుంచి శరవణముత్తు స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో బంగ్లాదేశ్ ఉంది. ఎందుకంటే ఈ టెస్టు బంగ్లాదేశ్‌కు చారిత్రక టెస్టు మ్యాచ్.

Bangladesh to play their 100th Test, hope to break losing streak inhistoric match

బంగ్లాదేశ్ 100వ టెస్టు మ్యాచ్ ఆడనుంది. గత 17 ఏళ్లుగా టెస్టు క్రికెట్‌లో తనదైన ముద్ర వేసేందుకు బంగ్లాదేశ్ జట్టు తనదైన శైలిలో యత్నిస్తోంది. ఇప్పటివరకు 99 టెస్టులాడిన బంగ్లాదేశ్ కేవలం 8 టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ 8 విజయాల్లో ఐదు విజయాలను బంగ్లాదేశ్ స్వదేశంలోనే గెలుపొందడం విశేషం.

ఐదింటిలో నాలుగు విజయాలను జింబాబ్వేపైనే నెగ్గింది. విదేశాల్లో ఆడిన 46 గేమ్‌ల్లో రెండు వెస్టిండిస్‌పై, మరొకటి జింబాబ్వేపై గెలుపొందింది. ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ ప్రదర్శన పేలవంగా ఉంది. 2001 నుంచి 2004 మధ్య కాలంలో బంగ్లాదేశ్ వరుసగా 21 టెస్టుల్లో పరాజయం పాలైంది.

చివరిసారిగా 2016 అక్టోబర్‌లో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా ఢాకా మ్యాచ్‌లో విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో వారి దేశంలో జరిగిన రెండు టెస్టుల్లో బంగ్లాదేశ్ ఓటమి పాలు కాగా, ఆపై భారత్ లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో కూడా పరాజయం చవిచూసింది.

జట్ల వివరాలు:

శ్రీలంక: రంగన్ హెరాత్ (కెప్టెన్), దైముత్ కరుణరత్నే, డిక్వెల్లా, ఉపుల్ తరంగా, ధనంజయ డి సిల్వా, కుశాల్ మెండిస్, అసెలా గుణరత్నే, దినేష్ చందిమల్, సురంగా లక్మల్, లాహిరు కుమార, నువాన్ ప్రదీప్, వైకుమ్ సంజయ బండార, దిల్రువా పెరెరా, లక్షణ్ సందకన్, మిలంద పుష్పకుమార

బంగ్లాదేశ్: ముష్ఫికర్ రహీమ్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్నన్ దాస్, సౌమ్య సర్కార్, మొమిహుల్ హక్, షకీబ్ అల్ హసన్, సబ్బీర్ రెహమాన్, ముస్ఫాఫిజుర్ రెహమాన్, తైజల్ ఇస్లాం, మోహిదీ హసన్, టాస్క్ అహ్మద్, హుస్సేన్, కుమ్రాల్ ఇస్లాం, రబ్బీ శభాషిస్ రాయ్, రుబెల్ హుస్సేన్.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X