హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వరల్డ్ లెజెండ్ అని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ షబ్బీర్ రెహ్మాన్ ప్రశంసలతో ముంచెత్తాడు. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రెహ్వాన్ తన హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
25 ఏళ్ల రెహ్మాన్ తన ప్రదర్శనతో బంగ్లాదేశ్ భవిష్యత్తు క్రికెటర్‌గా అవతరించాడు. ఇటీవల ధోనిని కలిసిన షబ్బీర్ అతనితో దిగిన ఫోటోను ఫేస్బుక్లో షేర్ చేశాడు. 'వరల్డ్ లెజెండ్ ఎంఎస్7'తో నేను అని క్యాప్షన్‌తో పోస్టు చేశాడు. ధోని నెంబర్ 7 జెర్సీని ధరించే సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా సైతం భారత ఆటగాళ్లు మంచి సంబంధాలున్నాయి. యువరాజ్ సింగ్.. మొర్తాజాకు మంచి స్నేహితుడు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఫైనల్లో ఓటమి అనంతరం భారత ఆటగాళ్లతో చాటింగ్ కూడా చేశామని టోర్నీ అనంతరం తెలిపిన సంగతి తెలిసిందే.
ఆటలో స్లెడ్జింగ్‌కు పాల్పడిన అది మైదానానికే పరిమితమని మొర్తజా అప్పట్లో పేర్కొన్నాడు.