న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లా జోరుకు ఇంగ్లాండ్ బ్రేక్: సారీ చెప్పేది లేదు

By Nageshwara Rao

చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సొంతగడ్డపై వరుసగా ఆరు సిరిస్ విజయాలు సాధించిన బంగ్లా జోరుకు ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (67 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

Bangladesh's winning streak at home ends as England clinch ODI series 2-1

ఈ మ్యాచ్‌‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు డుకెట్ 63, బిల్లింగ్స్ 62 పరుగులతో రాణించారు. చివర్లో బ్యాటింగ్‌కు దిగిన బెన్‌స్టోక్స్ 47 పరుగులు చేసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. బంగ్లా కెప్టెన్ మోర్తాజా, ఇస్లాం తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మూడు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే ఇంగ్లాండ్ గెలవగా, రెండో వన్డేలో బంగ్లాదేశ్ గెలిచింది.

సారీ చెప్పేది లేదు: తేల్చి చెప్పిన బంగ్లా కెప్టెన్

ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ జట్టుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫె మోర్తాజా తేల్చి చెప్పాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు బ్యాట్స్ మెన్ బట్లర్ ఔటైన సందర్భంగా బంగ్లా క్రికెటర్లు అతనికి పెవిలియన్ దారి చూపుతూ అతిగా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.

Bangladesh's winning streak at home ends as England clinch ODI series 2-1

ఈ సంఘటనలో తమ తప్పేమీ లేదని మోర్తాజా పేర్కొన్నాడు. మేము ఏ తప్పూ చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. వికెట్ తీసిన ఆనందంలో సంబరాలు చేసుకున్నామంతేనని తెలిపాడు. ఆ వీడియోని చూశానని, తమీమ్ తప్పేమీ లేదని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X