పాక్ చేతిలో భారత్ ఓటమి: బంగ్లా అభిమాని ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ది ఓవల్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫైనల్లో భారత ఆటగాళ్లు కనీసం పోరాడకుండా ఓటమి పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

'థాంక్యూ జెంటిల్‌ మ్యాన్': పాకిస్థానీయుల మనసు గెలిచిన కోహ్లీ

ఈ క్రమంలో భారత్‌లో పలు చోట్ల టీవీలను పగలగొట్టడంతో పాటు, క్రీడాకారుల దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేశారు. ఇదంతా భారత్‌‌లో జరిగితే టీమిండియా ఓటమి బంగ్లాదేశ్‌కు చెందిన ఒక వీరాభిమానిని ఆత్మహత్యకు ప్రేరిపించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కోహ్లీసేన ఓటమి తర్వాత బంగ్లాకు చెందిన బిద్యుత్(25) అనే అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.

Bangladeshi fan commits suicide after India's final defeat

టీమిండియా ఓటమి పాలైన కొద్ది సేపటికే వేగంగా వెళుతున్న రైలుకి ఎదురెళ్లి అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు ఢాకా పోలీస్ అధికారి నాసిరుల్ ఇస్లామ్ తెలిపారు. జమల్ పూర్‌కు చెందిన బిద్యుత్ షాంగ్ గేట్ ప్రాంతంలో ఒక చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

పాక్ చేతిలో ఓటమి: టీవీలు ధ్వంసం.. పోస్టర్లు దగ్థం (వీడియో)

కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో భారత్‌పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించి తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 25-year-old Bangladeshi fan of Indian cricket committed suicide by jumping in front of a train after India lost to Pakistan in the Champions Trophy.
Please Wait while comments are loading...