న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు జట్టు ఎంపిక: భజ్జీ ఔట్, మళ్లీ జట్టులోకి జడేజా

By Nageswara Rao

ముంబై: ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి రెండు వన్డేలు, తొలి రెండు టెస్టులకు బీసీసీఐ టీమిండియా జట్టును సోమవారం ప్రకటించింది. వన్డే జట్టులో ఉమేష్ యాదవ్ స్ధానంలో కర్ణాటకకు చెందిన శ్రీనాత్ అరవింద్‌ను జట్టులో అవకాశం కల్పించారు.

కాగా, దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు మ్యాచ్‌లో హర్భజన్ సింగ్‌కు చోటు దక్కలేదు. పెళ్లి కారణంగానే భజ్జీకి చోటు దక్కలేదని సమాచారం. ఇక గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దూరమయ్యాడు. అశ్విన్ స్థానంలో రంజీల్లో రాణిస్తున్న ఆల్ రౌండర్ జడేజాకు చోటు లభించింది.

BCCI announced Indian teams for Test series and remaining 2 ODIs against South Africa

దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరిస్‌కు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికిన తర్వాత విరాట్ కోహ్లీకి ఇది మొదటి హోం సిరిస్. శ్రీలంకతో టెస్టు సిరిస్ విజయం సాధించిన జట్టులో ముగ్గురికి చోటు దక్కలేదు.

సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్టు సిరిస్ ఇదే కావడం విశేషం. నవంబర్ 16, 2013 తర్వాత భారత్‌లో టీమిండియా టెస్టు సిరిస్ ఆడలేదు. నవంబర్ 2013లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన సొంత మైదానమైన వాంఖెడ్‌లో తన చివరి టెస్టు అయిన 200వ టెస్టు మ్యాచ్‌ను ఆడారు.

వన్డే జట్టు:
మహేంద్ర ధోనీ (కెప్టెన్), స్టువర్ట్ బిన్నీ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, అక్షర పటేల్, అజింక్య రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, రోహిత్ శర్మ, శ్రీనాథ్ అరవింద్, గురుకీర్త్ సింగ్, అమిత్ మిశ్రా, హర్భజన్ సింగ్

టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), ఎం విజయ్, శిఖర్ ధావన్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, ఇషాంత్ శర్మ

టెస్టు షెడ్యూల్
నవంబర్ 5-9 (Thursday to Monday): 1st Test, Mohali
నవంబర్ 14-18 (Saturday to Wednesday): 2nd Test, Bengaluru
నవంబర్ 25-29 (Wednesday to Sunday): 3rd Test, Nagpur
డిసెంబర్ 3-7 (Thursday to Monday): 4th Test, New Delhi

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X