ధోని కాళ్లకు మొక్కిన అభిమాని: బీసీసీఐ పూర్తి వీడియో

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్ జట్టుతో బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగింది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా కెప్టెన్‌గా ధోనికి ఆఖరి మ్యాచ్ కావడంతో అంతర్జాతీయ మ్యాచే అనే స్థానంలో సందడి నెలకొంది. ధోని.. ధోనీ.. ధోనీ అంటూ ధోనీ నామస్మరణతో మ్యాచ్ మారుమ్రోగిపోయింది. ధోనీని వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలి వచ్చారు.

పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి ధోనీ వీడ్కోలు పలకడం, కెప్టెన్‌గా ధోనికి ఆఖరి మ్యాచ్‌ కావడంతో అభిమానులు పోటెత్తారు. దీంతో మధ్యాహ్న సమయానికే స్టేడియం వెలుపల భారీ క్యూలు దర్శనమిచ్చాయి. అనంతరం నిమిషాల వ్యవధిలోనే స్టేడియంలో తొలుత ఈస్ట్ స్టాండ్, నార్త్ స్టాండ్ పూర్తిగా నిండిపోవడంతో ఆ తర్వాత ప్రేక్షకులు వెస్ట్ స్టాండ్‌లోకి ప్రవేశించారు.

BCCI video of a fan touching Dhoni's feet

దీంతో కొద్దిసేపటికే ఆ స్టాండ్ కూడా దాదాపు పూర్తిగా నిండిపోయింది. తెలుగు తేజం అంబటి రాయుడు రిటైర్డ్ అవుట్‌గా పెవిలియన్‌కు చేరిన అనంతరం ధోని బ్యాటింగ్‌కు దిగాడు. ఈ సమయంలో అభిమానులంతా లేచి నిలబడి చప్పట్లతో 'కెప్టెన్‌ కూల్‌'ను స్వాగతం పలికారు. ధోనీ.. ధోనీ.. అనే నినాదాలతో దద్దరిల్లింది.

అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ధోని చెలరేగి ఆడటంతో వారి ఆనందానికి అవధుల్లేకపోయింది. ఇదే సమయంలో ఓ అభిమాని స్టాండ్స్ నుంచి మైదానంలోపలికి దూసుకొచ్చాడు. భద్రత సిబ్బందిని తప్పించుకుని పిచ్‌ వద్దకు వచ్చేశాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు.

అభిమాని తనవైపు వస్తుండటం చూసి ధోని ముందే అప్రమత్తం అయ్యాడు. ఈ క్రమంలో ఆ అభిమాని ధోని వద్దకు వచ్చి కాళ్లకు మొక్కాడు. ఇంతలో ధోని అతడిని పైకిలేపి అతడితో షేక్ హ్యాండ్ ఇచ్చాడు. 'పిచ్‌పై పరిగెత్తవద్దు' అంటూ కూల్‌గా చెప్పిన ధోని క్రికెట్ ఆడే సమయంలో ఇలా మైదానంలోకి రావడం తప్పని హెచ్చరించాడు.

ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది అతడిని తీసుకుని గ్రౌండ్ వెలుపలకు తీసుకుపోయారు. ఈ మ్యాచ్‌లో ధోని 40 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని స్టేడియం నిర్వాహకులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The CCI stadium in Mumbai had gone up in a deafening roar when MS Dhoni walked out on to the pitch to bat for India A against England in the first warm up match. He went on to make 68 runs of 40 balls with 23 runs being taken from the last over in typical Dhoni style.
Please Wait while comments are loading...