కండరాలు పట్టేసినా... సెంచరీతో జట్టుని గెలిపించిన స్టోక్స్ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. వేలంలో బెన్ స్టోక్స్‌ను పూణె ప్రాంచైజీ రూ. 14.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత బెన్ స్టోక్స్ ఆ స్థాయి మేరకు ఆడిన దాఖలు లేదు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు

కానీ సోమవారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తానెంటో చూపించాడు. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియం వేదికగా గుజరాత్‌ లయన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్‌ (63 బంతుల్లో 103 నాటౌట్‌; 7 ఫోర్లు, 6 సిక్సుల)తో అద్భుత సెంచరీతో పూణెను ఓటమి నుంచి గెలిపించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ 19.5 ఓవర్లలో 161 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం 162 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణె తొలి 6 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయింది. ఆ మరుసటి ఓవర్‌లో మరో వికెట్‌ ఇలా... రహానే (4), స్మిత్‌ (4), తివారి (0) అవుటయ్యారు.

Ben Stokes century scripts stunning Pune win

దీంతో 10 పరుగులకే పూణె 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్ 103 నాటౌట్‌(63 బంతులు, ఆరు సిక్సులు)కు జత కలిసిన ధోని 26(33 బంతులు, ఒక సిక్సు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన బెన్ స్టోక్స్‌... ధోని (26)తో ఐదో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

చివరి ఓవర్‌కు ముందు కండరాలు పట్టేయడంతో కాసేపు విలవిల్లాడిన స్టోక్స్‌ ఆఖరి ఓవర్లో 61 బంతుల్లో సెంచరీని పూర్తి చేసి మరో బంతి మిగిలివుండగానే పూణెకి విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన బెన్ స్టోక్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో పుణెకు గుజరాత్‌పై ఇదే తొలి విజయం.

బెన్ స్టోక్స్‌ అద్భుత సెంచరీ వీడియో మీకోసం:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A maiden T20 hundred from Ben Stokes moved Rising Pune Supergiant to their sixth win of the season in a seesawing contest against Gujarat Lions. Battling cramp, frequent wicket losses at the other end, and the demands of a testing asking rate, Stokes steered Rising Pune home with a ball to spare.
Please Wait while comments are loading...