రవిశాస్త్రి మద్దతు: బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌కు బాధ్యతల్ని అప్పజెప్పేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ నియామకం పూర్తిగా అయిందని, అతడికి మద్దతుగా నిలిచిన రవిశాస్త్రికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా అతడు సిద్ధమయ్యాడు.

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపిక అయిన తర్వాత పూర్తిస్థాయి బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ పేరుని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) జహీర్ ఖాన్‌ని బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఎంపిక చేసినప్పటికీ తనకు పూర్తిస్థాయిలో, జట్టు వెంబడి ఉండే బౌలింగ్ కోచ్ కావాలని రవిశాస్త్రి పట్టుబట్టిన సంగతి తెలిసిందే.

విదేశీ పర్యటనల్లో జహీర్ ఖాన్ సేవలు

విదేశీ పర్యటనల్లో జహీర్ ఖాన్ సేవలు

ఈ నేపథ్యంలో బీసీసీఐ పరిపాలనా కమిటీ దిగొచ్చింది. జహీర్ ఖాన్ పూర్తిస్థాయి కోచ్ కాదని, కేవలం 150 రోజుల పాటు మాత్రమే బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తాడని అధికారిక ప్రకటన కూడా చేసింది. విదేశీ పర్యటనల్లో జహీర్ ఖాన్ సేవల్ని ఉపయోగించుకుంటామని కూడా తెలిపింది.

Ravi Shastri Ask for Arun As Bowling Coach | Oneindia Telugu
సీఏసీపై వినోద్ రాయ్ అసంతృప్తి

సీఏసీపై వినోద్ రాయ్ అసంతృప్తి

సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక చేసే బాధ్యతల్ని మాత్రమే అప్పగించామని అయితే బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్‌లను సైతం ప్రకటించడంపై వినోద్ రాయ్ నేతృత్వంలో సీఓఏ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

పెండింగ్‌లోనే ద్రవిడ్, జహీర్ ఖాన్ నియామకం

పెండింగ్‌లోనే ద్రవిడ్, జహీర్ ఖాన్ నియామకం

ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్‌ల నియామకాన్ని పెండింగ్‌లో ఉంచాలని బీసీసీఐని కూడా ఆదేశించారు. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికను మాత్రమే సీఓఏ పూర్తిస్థాయి సమర్ధించింది. అంతేకాదు సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రధాన కోచ్‌కు అప్పగించాలని కూడా పేర్కొంది.

బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్

బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్

2014 నుంచి 2016 మధ్య కాలంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి కొత్త కోచ్‌గా ఎంపిక కావడం అతడు కూడా భరత్ అరుణ్‌నే తనకు పూర్తిస్థాయి బౌలింగ్ కోచ్‌గా కావాలని పట్టుబడటంతో భరత్ అరుణ్ ఎంపిక ఖాయమైనట్లే కనబడుతోంది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ పాలకుల కమిటీతో రవిశాస్త్రి సమావేశమై తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bharat Arun is all set to join the Indian national cricket team as a bowling coach. According to media reports, Arun will be appointed soon, thanks to Ravi Shastri who has been his big supporter. One must remember that Arun has worked with the Indian team at a time when Shastri was the team director between 2014 and 2016.
Please Wait while comments are loading...