ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించిన భువనేశ్వర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువనేశ్వర్ కుమార్ ఓ అరుదైన ఘనత సాధించాడు. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

దీంతో ఐపీఎల్‌లో వంద వికెట్ల మార్కుని భువనేశ్వర్ కుమార్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో వంద వికెట్లను సాధించిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. అంతేకాదు అతి తక్కువ మ్యాచ్‌ల్లో ఈ రికార్డు నమోదు చేసిన రెండో బౌలర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. అంతక ముందు ముంబై ఇండియన్స్ ఆటగాడు లసిత్ మలింగ తక్కువ మ్యాచ్‌ల్లో వంద వికెట్లను సాధించాడు.

Bhuvaneshwar Kumar took 100 wickets in ipl

మలింగ్ 70 మ్యాచ్‌ల్లో ఈ ఘటన సాధించగా, భువనేశ్వర్ కుమార్ 81 మ్యాచ్‌ల్లో వంద వికెట్లను సాధించాడు. ఐపీఎల్‌లో 2014 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 23 వికెట్లతో అగ్రస్దానంలో నిలవడంతో పాటు ఐపీఎల్ టైటిల్‌ను సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

2014లో 20 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లతో బౌలర్ల పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో నిలిచాడు. 2015లో 18 వికెట్లు తీశాడు. అంతకు ముందు 2010 నుంచి 2013 వరకు అప్పటి జట్టు పుణే వారియర్స్ ఇండియా తరుపు ఆడిన భువనేశ్వర్ 25 వికెట్లు తీశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad rode on the individual brilliance of captain David Warner (70 not out) and Bhuvneshwar Kumar (5/19) as they pulled off a nail-biting 5-run win over Kings XI Punjab in a topsy-turvy game that went down to the very last over in Hyderabad on Monday.
Please Wait while comments are loading...