ఆమె నా గర్ల్‌ఫ్రెండ్ కాదు: లక్కీ గర్ల్ ఫోటోలపై భువీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రముఖ మోడల్‌, నటి అనుస్మృతి సర్కార్‌తో డేటింగ్‌‌లో ఉన్నాడంటూ వస్తున్న వార్తలను టీమిండియా బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ తీవ్రంగా ఖండించాడు. ఇటీవల భువీ ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేస్తున్న ఫొటో ఒకటి తన ఇన్‌స్టాగ్రాంలో ఉంచి 'డిన్నర్‌ డేట్‌, పూర్తి చిత్రం త్వరలో' అని పేర్కొన్నాడు.

భువీతో మిస్టరీ డేట్: ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలిసింది?

నగరంలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సందర్భంలో భువనేశ్వర్ చేతిలో గ్లాస్, అందులో రెండు స్ట్రాలు ఉన్న ఫొటోను అప్ లోడ్ చేశాడు. త్వరలోనే పుల్ పిక్చర్‌ను చూస్తారంటూ మరింత ఆసక్తిని రేకెత్తించాడు. దీంతో వెంటనే అభిమానులు ఎవరా లక్కీగర్ల్‌ అంటూ కామెంట్లు పెట్టారు.

Bhuvneshwar Kumar quashes rumours of dating actor Anusmriti Sarkar, says will reveal name ‘when it’s time’

ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్‌, టాలీవుడ్‌ నటి అనుస్మృతి సర్కార్‌ అంటూ వీరిద్దరూ కలిసి కారులో ఉన్న ఫొటోలను అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. కారులో భువి పక్కన ఉన్నది మోడల్‌ అనుస్మృతి సర్కార్‌ అని ప్రచారం చేశారు. అటూ ఇటూ తిరిగి ఈ ఫోటో భువి కంట పడింది.

దీంతో ఈ వార్తలపై శుక్రవారం భువనేశ్వర్ కుమార్ స్పందించాడు. ''నేను ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న పుకార్లు పచ్చి అబద్ధం. మీరనుకుంటున్నట్లు నేను తనతో డేటింగ్‌లో లేను. దయచేసి ఈ పుకార్లను ఇంతటితో ఆపేయండి. సమయం వచ్చినప్పుడు స్వయంగా నేనే చెప్తాను ఎవరితో డేటింగ్‌లో ఉన్నానో..'' అని భువి తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad and India pacer Bhuvneshwar Kumar has quashed rumours of him dating Anusmriti Sarkar. Kumar had uploaded an image of him sitting at a table in a restaurant on May 11 with the other side of the table cut out from the photo and said that he would reveal his dinner date soon.
Please Wait while comments are loading...