రెండో ఫీల్డర్: కొలంబో టెస్టులో రహానే అరుదైన ఘనత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 50 క్యాచ్‌ల మార్కుని చేరుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా 50 క్యాచ్‌లు పట్టిన భారత రెండో ఫీల్డర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు.

రహానే 39 టెస్టుల్లో 50 క్యాచ్‌ల మైలురాయిని అందుకోవడం విశేషం. శ్రీలంకపై విజయం సాధించిన రెండో టెస్టులో రహానే ఐదు క్యాచ్‌లు పట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 25, రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేసిన దిముత్‌ కరుణరత్నె క్యాచ్‌లను రహానేనే పట్టుకున్నాడు.

Big achievement for Ajinkya Rahane, now star batsman holds THIS record too

ఈ క్యాచ్‌లు మ్యాచ్ ఆటతీరునే మార్చేశాయి. ఈ ఐదు క్యాచ్‌లతో 39 టెస్టుల్లో 50 క్యాచ్‌లు పూర్తిచేశాడు. భారత్ తరుపున 14వ ఆటగాడు. అంతకుముందు అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించిన భారత ఆటగాడు ఏక్ నాథ్ సోల్కర్. సోల్కార్ 26 టెస్టుల్లోనే 50 క్యాచ్‌లను మార్కును అందుకున్నాడు.

శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది టీమిండియాకు వరుసగా ఎనిమిదో సిరీస్ విజయం కాగా, వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌లు ఘనత ఆసీస్ పేరిట ఉంది. 2005 నుంచి 2008 జూన్ మధ్య కాలంలో ఆసీస్ జట్టు వరుసగా తొమ్మిది సిరీస్ విజయాల్ని నమోదు చేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It’s an achievement for Ajinkya Rahane. The blistering Indian opener became the 14th player from his side to take 50 catches.
Please Wait while comments are loading...