ఆస్ట్రేలియా ఫీల్డింగ్ కోచ్‌గా బ్రాడ్ హాడిన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియా జాతీయ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ వికెట్ కీపర్, క్రికెటర్ బ్రాడ్ హాడిన్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన చేసింది. 39 ఏళ్ల బ్రాడ్ హాడిన్ గతంలో ఆసీస్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా సేవలందించాడు.

ఈ నేపథ్యంలో అతడిని ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఆసీస్ మాజీ బ్యాట్స్‌మన్ గ్రెగ్ బ్లెవెట్ స్థానంలో హాడిన్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించింది. 2019 వరకూ హాడిన్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు.

Brad Haddin roped in as Australia's fielding coach

ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా-ఏ జట్టుకు హాడిన్ కోచ్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. త్వరలో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు జట్టుతో పాటే హాడిన్ వెళ్లనున్నాడు.

పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీపీఎల్)లో ఇస్లామాబాద్ ప్రాంఛైజీకి కోచ్‌గా కుడా హాడిన్ సేవలందించాడు. 2015లో తన అంతర్జాతీయ క్రికెట్‌కు హాడిన్ గుడ్ బై చెప్పిన తర్వాత కోచ్ అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియా తరపున 66 టెస్టులాడిన హాడిన్ 262 క్యాచ్‌లు అందుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 126 వన్డేలాడిన హాడిన్ 34 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former wicketkeeper-batsman Brad Haddin has been appointed as the new fielding coach of the Australian national cricket team.
Please Wait while comments are loading...