ఛాంపియన్స్ ట్రోఫీ: పైనల్లో భారత్-ఆసీస్ ఢీ, ఇది క్లార్క్ అంచనా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ ఏడాది ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ విజేతపై అప్పుడే చర్చ జరుగుతోంది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: 8 జట్ల పూర్తి వివరాలు

ప్రపంచంలోని టాప్ ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

Champions Trophy 2017: An India-Australia final is predicted

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పైనల్ మ్యాచ్ జూన్ 18న ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు ఒక పరుగు తేడాతో విజయం సాధిస్తుందని క్లార్క్ జోస్యం చెప్పాడు.

అంతేకాదు ఐపీఎల్ పదో సీజన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజ్యింకే రహానే బ్యాటింగ్‌లో రాణించలేకపోయినా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపబోదని క్లార్క్ వివరించారు. ట్రోఫీ జరిగే ఇంగ్లాండ్ వాతావరణం పేస్, స్వింగ్‌కి అనుకూలిస్తే ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని అన్నాడు.

ఒకవేళ స్పిన్‌కి అనుకూలిస్తే టీమిండియాదే పైచేయి సాధిస్తుందని మైకేల్ క్లార్క్ అంచనా వేశారు. 'ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్‌లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అంచనా వేస్తున్నా. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక పరుగు తేడాతో విజయం సాధిస్తుంది' అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.

'ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడతాయని నా నమ్మకం. అక్కడి పరిస్థితులు కూడా మ్యాచ్‌లపై ప్రభావం చూపుతాయి. పేస్, స్వింగ్‌కి సహకారం లభిస్తే మిచెల్ స్టార్క్, పాటిన్సన్, హేజిల్‌వుడ్, కమిన్స్ తదితర ఆస్ట్రేలియా పేసర్లను ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కి కష్టమవుతుంది' అని పేర్కొన్నాడు.

'ఒకవేళ స్పిన్‌కి అనుకూలిస్తే.. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పండగ చేసుకుంటారు. టోర్నీలోని ఏ జట్టు‌కూ ఇలాంటి సమర్థ స్విన్ జోడీ లేదు. ఐపీఎల్‌తో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఇన్నింగ్స్ నిర్మించేందుకు చాలా సమయం ఉంటుంది కాబట్టి కోహ్లి, రహానే ఫామ్‌పై భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదు' అని క్లార్క్ వివరించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గ్రూప్ బీలో ఉంది. భారత్తో పాటు పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు ఈ గ్రూపులో ఉన్నాయి. జూన్ 4న పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్ క్రికెటర్లు ధోని, యువరాజ్‌లతో పాటు యువ ఆటగాళ్లు మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యాలతో సమతూకంగా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Australia captain Michael Clarke on Saturday (May 13) said he expects India and Australia to reach the ICC Champions Trophy final, and hoped the latter would win by one run.
Please Wait while comments are loading...