పాక్ అభిమాని రెచ్చగొట్టే వ్యాఖ్య: షమీకి కోపం, వారించిన ధోని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా ది ఓవల్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఓ పాక్ అభిమాని చేష్టలకు గాను భారత క్రికెట్ మహ్మద్ షమీ అతడిని కొట్టేంత పని చేశాడు.

'థాంక్యూ జెంటిల్‌ మ్యాన్': పాకిస్థానీయుల మనసు గెలిచిన కోహ్లీ

మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో ఓ పాకిస్తాన్ అభిమాని వీడియో తీస్తూ ఆటగాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 'బాప్ కౌన్ హై (తండ్రి ఎవరు)' అంటూ భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

Champions Trophy 2017: Angry Mohammed Shami reacts to Pakistani fan's 'baap kaun hai' provocations

అయితే ఓటమి నిరాశలో ఉన్న భారత క్రికెటర్లు ఈ వ్యాఖ్యలను పట్టించుకోకుండా గొడవ ఎందుకులే అని డ్రస్సింగ్ రూమ్‌ వైపు నడుచుకుంటూ వెళ్లారు. అదే సమయంలో వెనుక వస్తున్న మహ్మద్ షమీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను విని అతడి వైపుకు వెళ్లాడు.

పాక్ చేతిలో ఓటమి: టీవీలు ధ్వంసం.. పోస్టర్లు దగ్థం (వీడియో)

ఏం మాట్లాడుతున్నావంటూ అతడిని చూసి గట్టిగా అరిచాడు. ఇంతలో షమీ వెనుక వస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని... షమీని వారించి అతడితో ఎందుకు పదా అంటూ డ్రస్సెంగ్ రూమ్‌కు తోడ్కొని వెళ్లాడు. ఈ తతంగం మొత్తం వీడియో రూపంలో రికార్డు అయింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ చేతిలో ఓటమిని తట్టుకోలేని భారత అభిమానులు ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. నిజానికి భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు కొందరు భారత అభిమానులు పాకిస్థాన్‌తో పోలిస్తే టీమిండియా మంచి ప్రదర్శన చేస్తుందని, ఫాదర్స్ డే రోజున బాప్ (తండ్రి) గెలుస్తాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

పైనల్‌కి ముందు టీమిండియా అన్ని రంగాల్లో పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ పైనల్లో బౌలర్లు తేలిపోవడంతో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది.

అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. టోర్నీ మొత్తం మీద ఏ జట్టు చేతిలో అయితే ఓడిపోయిందో అదే జట్టుపై 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాకిస్తాన్ ఛాంపియన్స్‌గా నిలిచింది. తొలిసారిగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఐసీసీ మూడు ప్రపంచ టైటిళ్లను నెగ్గిన వెస్టిండీస్‌, భారత్‌, శ్రీలంక సరసన నిలిచింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India cricketer Mohammed Shami was infuriated by the taunts of an enthusiastic Pakistani fan at the stadium after losing in final against Pakistan in the ICC Champions Trophy 2017.
Please Wait while comments are loading...