ఛాంపియన్స ట్రోఫీ: మనీశ్ పాండే ఔట్, దినేశ్ కార్తీక్ ఇన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన ఆనందం టీమిండియా యువ ఆటగాడు మనీష్‌ పాండేకు ఎన్నో రోజులు నిలువలేదు. గాయం కారణంగా అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 15 మందితో కూడిన భారత జట్టులో దినేశ కార్తీక్‌ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ గురువారం ప్రకటించింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: 8 జట్ల పూర్తి వివరాలు

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న మనీశ్ పాండే సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సమయంలో పక్కటెముక గాయంతో ఇబ్బంది పడ్డాడు. తాజాగా గాయం పెద్దది కావడంతో అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తొలగించారు. పాండే భారత తరఫున చివరగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో పాల్గొన్నాడు.

ఈ ఐపీఎల్‌లో గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. 14 మ్యాచ్‌ల్లో 36.10 సగటుతో 361 పరుగులు చేశాడు. అంతకుముందు విజయ్‌ హజారే ట్రోఫీ, దేవ్‌ధర్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంచరీలు చేసి మ్యాన ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

 Champions Trophy 2017: Dinesh Karthik replaces injured Manish Pandeyin India squad

దేశవాళీ సీజన్‌లో పరుగులు మోత మోగించినందుకు అతన్ని జట్టులోకి తీసుకుంటున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. త్వరలోనే 32వ పడిలోకి అడుగుపెట్టనున్న కార్తీక్ విజయ్ హజారే టోర్నీలో తమిళనాడు తరఫున 607 పరుగులు చేశాడు. రంజీల్లో 704, ఐపీఎల్‌లో 361 పరుగులు సాధించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా..!

2014 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌పై చివరి మ్యాచ్ ఆడిన కార్తీక్.. 2013లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ భారత జట్టులోనూ కార్తీక్‌ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఐదుగురు స్టాండ్‌బైలలో దినేశ్ కార్తీక్ కూడా ఒక్కడు. సురేశ రైనా, రిషభ్‌ పంత్, కుల్దీప్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు స్టాండ్‌బైలుగా వ్యవహరించనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior wicketkeeper-batsman Dinesh Karthik has replaced middle-order batsman Manish Pandey in Indian squad for the upcoming Champions Trophy 2017.
Please Wait while comments are loading...