గెలిచిన జట్టుకు డబ్బే: భారీగా పెరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రైజ్‌మనీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జూన్ 1 నుంచి ఇంగ్లాండ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైజ్ మనీని ఐసీసీ భారీగా పెంచింది. ఈ టోర్నీ ప్రైజ్ మనీని 4.5 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 28.87 కోట్లు)కు పెంచింది. 2013లో జరిగిన టోర్నీతో పోలిస్తే ఇది 5 లక్షల డాలర్లు (రూ.3.20 కోట్లు) ఎక్కువ.

ఛాంపియన్స్ ట్రోఫీ: పైనల్లో భారత్-ఆసీస్ ఢీ, ఇది క్లార్క్ అంచనా

మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు రూ. 14 కోట్లు (2.2 మిలియన్‌ డాలర్లు) బహుమతిగా అందుకోనుంది. 'ఇంగ్లాండ్‌లో జూన్‌ 1-18 మధ్య జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ నగదు బహుమానాన్ని 4.5 మిలియన్‌ డాలర్లకు పెంచాం. ఎనిమిది జట్లలో విజేతకు 2.2 మిలియన్‌ డాలర్లు సొంతం చేసుకుంటుంది' అని ఐసీసీ ప్రకటించింది.

Champions Trophy 2017: ICC announce $2.2 million as prize money for the winning team

రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.1 మిలియన్‌ డాలర్లు (రూ.7.06 కోట్లు), సెమీఫైనల్స్‌కు చేరిన మిగతా రెండు జట్లకు 4 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2.89 కోట్లు) చొప్పున ఇస్తారు. ప్రతి గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 90 వేల డాలర్ల (రూ.58 లక్షలు), ఆఖరి స్థానంలో నిలిచిన జట్టుకు 60 వేల డాలర్ల (రూ.38 లక్షలు) అందజేస్తారని ఐసీసీ తెలిపింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ: 8 జట్ల పూర్తి వివరాలు

ఐసీసీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ జూన్ 1 నుంచి 18 వరకు లండన్‌లో జరగనుంది. ఈ టోర్నీలో టాప్ ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ఈ టోర్నీలో టీమిండియా ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The International Cricket Council (ICC) has announced the prize money for the upcoming Champions Trophy 2017 on Sunday (May 14). The team that will win the ICC tournament will be awarded the prize money of $ 2.2 million while the runners-up will bag $ 1.1 million.
Please Wait while comments are loading...