తొలి మ్యాచ్‌లో తొలి వికెట్: పాక్ బౌలర్ అరుదైన ఘనత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాక్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతోన్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే రుమాన్‌ రాయిస్‌ తొలి వికెట్‌ను తీసి రికార్డు సృష్టించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు 

 Rumman Raees strikes on debut match

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో గాయపడిన రియాజ్‌ స్థానంలో రాయిస్‌ను పాక్‌ జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. రుమాన్‌ రాయిస్‌ వేసిన ఆరో ఓవర్‌ ఐదో బంతిని ఎదుర్కొన్న హేల్స్‌(13) బాబర్‌ అజామ్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌కు చేరాడు. దీంతో తొలి మ్యాచ్‌ ఆడుతున్న రాయిస్‌ ఇంగ్లాండ్‌ తొలి వికెట్‌ తీయడం విశేషం.

ఈ మ్యాచ్‌తో రాయిస్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆరంగేట్రం చేసిన పాక్‌ ఆటగాళ్లు జమాన్‌, ఫహీమ్‌ ఆష్రఫ్‌ సరసన నిలిచాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ ద్వారా పాక్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు జమాన్‌, ఫహీమ్‌ ఆష్రఫ్‌, రుమాన్‌ రాయిస్‌ వన్డేల్లో అరంగేట్రం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
WICKET! What a moment for the 25-year-old Raees. Hales launches into a big cover drive against the left arm paceman, but he mis-times it, and only managed to lob it straight into the safe hands of Babar Azam.
Please Wait while comments are loading...