న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్లో భారత్‌: ఫాదర్స్ డే (ఆదివారం) రోజున పాక్‌తో మ్యాచ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన రెండో సెమీ పైనల్ పోరు ప్రారంభమైంది. 
 టోర్నీలో భాగంగా గురువారం జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి.

By Nageshwara Rao

హైదరాబాద్: ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 59 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తాజా విజయంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ పైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది.

265 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు చక్కటి శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(123; 129 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సు నాటౌట్), శిఖర్ ధావన్, (46; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ధావన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి (96; 78 బంతుల్లో 13 ఫోర్లు నాటౌట్)లతో రాణించాడు.

India have won the toss, invite Bangladesh to bat first


ఈ మ్యాచ్‌లో ధావన్ తృటిలో అర్ధ సెంచరీ కోల్పోయినా రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మంచి సహకారం లభించడంతో టీమిండియా గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. వీరిద్దరూ సునాయాసంగా బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

వీరిద్దరూ చక్కటి కవర్ డ్రైవ్‌లు, స్ట్రయిట్ డ్రైవ్‌లతో అలరిస్తూ అద్భుతమైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఈ క్రమంలోనే తొలుత రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించగా, ఆపై కోహ్లీ కూడా అర్థ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ రాణించడంతో విజయం ఏకపక్షమైంది. వీరి దూకుడును బంగ్లా బౌలర్లు ఏ దశలోనూ అడ్డుకోలేకపోయారు.


సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శిఖర్ ధావన్ వెనుదిరిగిన తర్వాత కెప్టెన్ కోహ్లీతో జత కలిసిన రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. వీరిద్దరూ ధాటిగా ఆడుతూ బంగ్లా బౌలర్ల సహనాన్నిపరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో 89 బంతుల్లో వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ఈ క్రమంలో 111 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 11వ సెంచరీ. ప్రస్తుతం 33 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 212 పరుగులు చేసింది. టీమిండియా విజ‌యానికి మ‌రో 17 ఓవ‌ర్ల‌లో 53 ప‌రుగులు చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో మోర్టాజాకు ఒక వికెట్ ద‌క్కింది. రోహిత్ 103, కోహ్లీ 69 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లీ అర్ధసెంచరీ
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ అర్ధసెంచరీతో చెలరేగాడు.42 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో 51 పరుగులతో కోహ్లీ అర్ధసెంచరీని నమోదు చేశాడు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్ 46 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన ట్రేడ్‌ మార్క్‌ కళాత్మక డ్రైవ్‌లతో మైదానంలోని అభిమానులను అలరిస్తున్నాడు. ఎడ్జిబాస్టన్ స్టేడియంలో కోహ్లీ... కోహ్లీ... కోహ్లీ అభిమానులు హోరెత్తిస్తున్నారు.

రోహిత్ శర్మ అర్ధసెంచరీ: వంద పరుగులు దాటిన భారత్
ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షకీబల్ హసన్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన రోహిత్ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్ శర్మ (55), కెప్టెన్ కోహ్లీ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Sharma

అర్ధసెంచరీ ముందు ధావన్ అవుట్
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 87 పరుగుల వద్ద శిఖర్ ధావన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 14.4 ఓవర్లో మోర్తాజా బౌలింగ్‌లో హొస్సైన్‌కు క్యాచ్ ఇచ్చి ధావన్ వెనుదిరిగాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 46 పరుగులు చేసిన ధావన్ 4 పరుగుల తేడాతో అర్ధ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Dhawan

ధాటిగా ఆడుతోన్న టీమిండియా
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్ మ్యాచ్‌లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 21, శిఖర్ ధావన్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.


భారత్ విజయ లక్ష్యం 265
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెన‌ర్ త‌మీమ్ ఇక్బాల్ (70), ముష్ఫిక‌ర్ ర‌హీమ్ (61) దూకుడుగా ఆడుతూ అర్ధ సెంచ‌రీలు చేయ‌డంతో ఒక ద‌శ‌లో భారీ స్కోరు చేస్తుంద‌ని అనుకున్న తరుణంలో స్పిన్న‌ర్ కేదార్ జాద‌వ్, పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బంగ్లాను క‌ట్ట‌డి చేశారు.

దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల కోల్పోయి 264 పరుగులు చేసింది. మూడో వికెట్‌కు త‌మిమ్ ఇక్బాల్‌, ర‌హీమ్‌ల‌ు 123 ప‌రుగులు జోడించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కేదార్ జాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. చివ‌ర్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశాడు.

అంతకముందు బంగ్లాదేశ్ బ్యాటింగ్ సాగిందిలా:

ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌లో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో జట్టు స్కోరు 229 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన మహ్మదుల్లా (21) క్లీన్ బౌల్డయ్యాడు. 46 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ ఏడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మొర్తాజా 13, టస్కిన్ అహ్మద్ 1 పరుగుతో ఉన్నారు.

ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌లో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బ్రహ్మాండమైన క్యాచ్‌కు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ హొస్సైన్ (15) పెవిలియన్ చేరాడు. హొస్సైన్ అవుట్‌తో బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో బంతిని కట్ చేసేందుకు ప్రయత్నించిన హొస్సైన్ అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 43 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 220 పరుగులు చేసింది.

బంగ్లా మ్యాచ్‌లో కోహ్లీ వింత ప్రవర్తన
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌లో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో కోహ్లీ వింతగా ప్రవర్తించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 2 పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో షకీబల్ హసన్ (15) కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే 61 పరుగులు చేసిన ముష్పికర్ రహీం జాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోహ్లీ తన నాలుకని బయట పెట్టి అదోలా ముష్పికర్ రహీం వైపు చూశాడు.

Kohli

2 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌లో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ 2 పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 177 పరుగుల వద్ద షకీబ్ ఉల్ హాసన్ వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ తర్వాత 179 అంటే రెండు పరుగుల తేడాతో రహీమ్ వికెట్‌ను కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో షకీబల్ హసన్ (15) కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే 61 పరుగులు చేసిన ముష్పికర్ రహీం జాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు. దీంతో 36 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది.

అర్ధసెంచరీ చేసిన తమీమ్‌ను పెవిలియన్‌కు పంపిన జాదవ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌లో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 154 పరుగుల వద్ద కేదార్ జాదవ్ బౌలింగ్‌లో తమీమ్ ఇక్బాల్ (70; 7 ఫోర్లు, ఒక సిక్సు) వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డయ్యాడు. దీంతో 28 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ అవుటైన తర్వాత షకీబ్ ఉల్ హాన్ క్రీజులోకి వచ్చాడు. షకీబ్ ఉల్ హాన్ 1,
ముష్పికర్ రహీం 53 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India have won the toss, invite Bangladesh to bat first

తమీమ్ ఇక్బాల్ అర్ధసెంచరీ

భారత్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్లో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తరుపున నిలకడగా ఆడుతున్న బ్యాట్స్‌మెన్లలో తమీమ్ ఇక్బాల్ ఒకడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 46 పరుగుల వద్ద జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ ఆఖరి బంతికి బౌండరీకి తరలించి అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. ముస్తాఫిజుర్ రహీమ్‌తో కలిసి తమీమ్ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. 23 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 130 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇక్భాల్ 63, ముష్పికర్ రహీం 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫీల్డింగ్‌ ఆశించిన రీతిలో లేదు.

100 మార్కును దాటిన బంగ్లాదేశ్ స్కోరు
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్‌లో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వంద పరుగులు చేసింది. సౌమ్య స‌ర్కార్ 0, ష‌బ్బిర్ 19 ప‌రుగుల‌కి అవుట్ కాగా అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన ర‌హీమ్ 25 ప‌రుగులతో క్రీజులో ఉన్నాడు. ఓపెన‌ర్ ట‌మిమ్ క్రీజులో నిల‌క‌డ‌గా రాణిస్తూ 62 బంతుల్లో 50 ప‌రుగులు చేశాడు. 20 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి బంగ్లాదేశ్ జ‌ట్టు 105 ప‌రుగులతో ఉంది. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు.

తమీమ్‌ అవుట్‌: నో బాల్‌గా ప్రకటించిన అంఫైర్
భారత్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్లో బంగ్లాదేశ్ నిలకడగా ఆడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. తమీమ్‌ ఇక్బాల్‌ (26), ముష్పికర్ రహీం (15) నిలకడగా ఆడుతున్నారు. బంగ్లా ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ తృటిలో అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. పాండ్యా వేసిన 12.5వ బంతి ఇక్బాల్‌ బ్యాట్‌ అంచుకు తాకి వికెట్లను తాకింది. అయితే అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో అతడు బతికిపోయాడు.

Iqbal

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
భారత్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్లో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద షబ్బీర్ రెహ్మాన్... భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన ష‌బ్బిర్ 19 ప‌రుగ‌ల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద అదే భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో ఆర‌వ ఓవ‌ర్ నాలుగవ బంతికి వెనుదిరిగాడు. షబ్బీర్ రెహ్మాన్ అవుటైన తర్వాత ముష్పికర్ రహీం క్రీజులోకి వచ్చాడు. అంతకముందు
తొలి ఓవర్ 6వ బంతికి ఓపెనర్ సౌమ్య సర్కార్ డ‌కౌట్ అయ్యాడు. 8 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. ప్రస్తుతం తమీమ్ ఇక్బాల్ 8, రహీమ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

Rehman

సౌమ్య సర్కార్ డకౌట్: తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీ పైనల్లో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్ సౌమ్య సర్కార్ డౌకట్‌గా వెనుదిరిగాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటి వరకూ సౌమ్య సర్కార్‌ చేసిన పరుగులు 34 మాత్రమే.

దీంతో తొలి ఓవర్ ముగిసే సరికి బంగ్లా ఒక వికెట్ నష్టానికి ఒక పరుగు చేసింది. సౌమ్య సర్కార్ అవుటైన తర్వాత క్రీజులోకి షబ్బీర్ రెహ్మాన్ వచ్చాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం షబ్బీర్ రెహ్మాన్ 5, తమీమ్ ఇక్బాల్ 6 పరుగులతో క్రీజలో ఉన్నారు.

టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ: బంగ్లా బ్యాటింగ్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన రెండో సెమీ పైనల్ పోరు ప్రారంభమైంది. టోర్నీలో భాగంగా గురువారం జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

వ‌ర్షం కార‌ణంగా టాస్ ఐదు నిమిషాలు ఆల‌స్యంగా వేశారు. భారత్ జట్టు ఏ మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. మ్యాచ్‌కి ముందు దక్షిణాఫ్రికాతో ఆడిన జట్టుతోనే సెమీస్‌లో బరిలోకి దిగుతామని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాపై ఆడే తుది జట్టులో అశ్విన్ కూడా ఉన్నాడు.

యువీకి 300వ వన్డే, బీసీసీఐ స్పెషల్ గిప్ట్

ఈ మ్యాచ్ ద్వారా యువరాజ్ తన క్రికెట్ కెరీర్‌లో సరికొత్త రికార్డుని అందుకున్నాడు. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌తో అందుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే యువీకి 300వ వన్డే.

భారత తరపున కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేల మైలురాయిని అందుకున్నారు. వన్డేల్లో 300 మ్యాచ్‌లు ఆడిన మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌ల సరసన చేరనున్నాడు. తన కెరీర్‌లో 300వ వ‌న్డే ఆడుతున్న యువ‌రాజ్‌కు మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ చేత బీసీసీఐ స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చింది.

తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే పైనల్లో పాక్‌ను ఢీకొట్టనుంది. ఏ రకంగా చూసినా.. ఏ అంశంలోనూ పోల్చినా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్ అన్నది అందరికీ తెలిసిందే.

ఆటపరంగా, రికార్డులపరంగా బంగ్లాకు అందనంత ఎత్తులో టీమిండియా ఉంది. అయితే టెస్టు, టీ20లతో పోలిస్తే వన్డే ఫార్మాట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో గట్టిగా పోరాడి టీమిండియా చేతిలో ఓడడంతో నిరాశ చెందిన బంగ్లాదేశ్‌.. ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉంది.

జట్ల వివరాలు:
టీమిండియా: రోహిత్‌, ధవన్‌, కోహ్లీ (కెప్టెన్‌), యువరాజ్‌, ధోనీ (కీపర్‌), కేదార్‌, హార్దిక్‌, జడేజా, అశ్విన్‌, భువనేశ్వర్‌, బుమ్రా.
బంగ్లాదేశ్‌: తమీమ్‌, సౌమ్య సర్కార్‌, షబ్బీర్‌ రహ్మాన్‌, ముష్ఫికర్‌ (కీపర్‌), షకీబల్‌, మహ్మదుల్లా, మొసాదెక్‌, తస్కిన్‌, మోర్తజా (కెప్టెన్‌), రూబెల్‌, ముస్తాఫిజుర్‌.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X