నా భార్యే నాకు బాస్: ధావన్, సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పకప్పుడు టచ్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. జట్టులోని సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులతో సరదాగా ఉన్న వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు l | స్కోరు కార్డు

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా లండన్‌లో పర్యటిస్తోంది. తనతో పాటు భార్య, కుమారుడుని కూడా ధావన్ లండన్ తీసుకెళ్లాడు. మరో ఓపెనర్ రోహిత్‌శర్మ, రహానె కూడా తమ భాగస్వాములతో ఇంగ్లాండ్‌ పర్యనటకు వెళ్లారు.

టోర్నీలో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి బంగ్లాదేశ్‌తో సెమీ పైనల్‌ పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఎడ్జిబాస్టన్ వేదికగా గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో లండన్‌ నుంచి బర్మింగ్‌హామ్‌కు బయల్దేరారు.

ఈ బస్సులోనే ధావన్‌, రోహిత్‌, రహానె తమ భార్యలతో కలిసి బయల్దేరారు. ఈ సందర్భంగా వారందరితో కలిసి దిగిన ఓ సెల్ఫీని ధావన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. 'భార్యలు సంతోషంగా ఉంటే చాలు.. మిగతావన్ని సాఫీగా జరిగిపోతాయి' అని కామెంట్ కూడా పెట్టాడు.

Biwiyaan set matlab sab set...😍😜😜off to birmingham. @rohitsharma45 @ajinkyarahane 😊😊👍🏼

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on Jun 13, 2017 at 4:03am PDT

అంతేకాదు తన భార్యే తనకు బాస్ అని కూడా తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ధావన్-రోహిత్ శర్మల జోడీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా అరుదైన రికార్డుని సాధించారు.

ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 68, 125, 78 పరుగులు చేసి సత్తా చాటాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీల రికార్డులను సైతం బద్దలు కొట్టాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The old adage goes hell hath no fury like a woman scorned and it is also said that behind every successful man there is a woman and on Tuesday India opener Shikhar Dhawan showed that how he treats his wife like a queen.
Please Wait while comments are loading...