పాక్ కెప్టెన్‌కి అరుదైన గౌరవం: కోహ్లీ, ధావన్, భువీలకు చోటు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం ముగిసింది. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫారాజ్ అహ్మద్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు సంబంధించి ఐసీసీ అతడిని కెప్టెన్‌గా నియమించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఐసీసీ ప్రకటించిన ఈ జట్టులో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో నలుగురు పాకిస్థాన్, ముగ్గురు భారత్, ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉన్నారు. ఒకరు బంగ్లాదేశ్ ఆటగాడు. 12వ ఆటగాడిగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు.

పెద్ద టోర్నీ తర్వాత ఐసీసీ ఇలా ఓ జట్టును ఎంపిక చేసి ఆటగాళ్లను గౌరవించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జట్టుని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో మాజీ కెప్టెన్లు మైకేల్ ఆర్ధర్(ఇంగ్లాండ్), సౌరభ్ గంగూలీ (భారత్), రమీజ్ రాజా (పాకిస్థాన్)లు ఉన్నారు.

Champions Trophy 2017: Team of the tournament announced

ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టు సభ్యులు వీరే:

1. Shikhar Dhawan (India) (338 runs)
2. Fakhar Zaman (Pakistan) 252 runs)
3. Tamim Iqbal (Bangladesh) (293 runs)
4. Virat Kohli (India) (258 runs)
5. Joe Root (England) (258 runs)
6. Ben Stokes (England) (184 runs and three wickets)
7. Sarfraz Ahmed (Pakistan) (captain) (wicketkeeper) (76 runs and nine dismissals)
8. Adil Rashid (England) (7 wickets)
9. Junaid Khan (Pakistan) (8 wickets)
10. Bhuvneshwar Kumar (India) (7 wickets)
11. Hassan Ali (Pakistan) (13 wickets)
12. Kane Williamson (New Zealand) (244 runs)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The International Cricket Council (ICC) today (June 19) announced the Team of the ICC Champions Trophy 2017, which includes players from five of the eight participating sides, with Pakistan's Sarfraz Ahmed as captain.
Please Wait while comments are loading...