వన్డేల్లో నెంబర్ వన్ కోహ్లీదే: దిగజారిన డివిలియర్స్ ర్యాంక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మంగళవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 862 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డేల్లో అర్ధ సెంచరీలు చేసిన కోహ్లీ 22 పాయింట్లను సాధించాడు. దీంతో ఇప్పటివరకు నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ను వెనక్కు నెట్టాడు.

Champions Trophy 2017: Virat Kohli regains top spot in ICC ODI rankings

ప్రస్తుత ర్యాంకుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(861) నిలిచాడు. ఇక డివిలియర్స్(841 పాయింట్ల)తో మూడో స్థానానికి దిగజారాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వన్డేల్లో ఏబీ డివిలియర్స్ నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. దాంతో రేటింగ్ పాయింట్లను కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో మెరిసిన శిఖర్ ధావన్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ 13వ స్థానానికి పరిమితం కాగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక స్థానం దిగజారి 14వ స్ధానానికి పడిపోయాడు. ఇక బౌలింగ్ విభాగంలో భారత బౌలర్లకు ఎవ్వరికీ టాప్ 10లో చోటు దక్కలేదు. టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 20వ స్థానంలో నిలిచాడు.

టాప్ 10 వన్డే బ్యాట్స్‌మెన్ (జూన్ 13 నాటికి):
Rank (+/-) Player Team Points
1 (+2) Virat Kohli India 862
2 ( - ) David Warner Aus 861
3 (-2) AB de Villiers SA 847
4 (+1) Joe Root Eng 798
5 (+4) Kane Williamson NZ 779
6 (-2) Quinton de Kock SA 769
7 (-1) Faf du Plessis SA 768
8 (-1) Babar Azam Pak 763*
9 (-2) Martin Guptill NZ 749
10 (+5) Shikhar Dhawan Ind 746

టాప్ 10 వన్డే బౌలర్లు (జూన్ 13 నాటికి):
Rank (+/-) Player Team Points
1 (+4) Josh Hazlewood Aus 732
2 ( - ) Imran Tahir SA 718
3 ( - ) Mitchell Starc Aus 701
4 (-3) Kagiso Rabada SA 685
5 (-1) Sunil Narine WI 683
6 ( - ) Trent Boult NZ 665
7 (+18) Rashid Khan Afg 647*
8 (-1) Chris Woakes Eng 630
9 (+7) Liam Plunkett Eng 624*
10 (-2) Mohammad Nabi Afg 618

Note: '*' denotes highest ODI rankings attained for the first time.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India skipper Virat Kohli has reclaimed the top spot in batting, while Australian pacer Josh Hazlewood has achieved the number-one position in the bowlers' rankings for the first time in his career in the latest ICC ODI Player Rankings.
Please Wait while comments are loading...