స్టోక్స్ సెంచరీతో ఇంగ్లాండ్ గెలుపు: ఆసీస్ ఇంటికి, బంగ్లా సెమీస్‌కి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో చివరకు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఇంగ్లాండ్ 40 పరుగుల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు  | స్కోరు కార్డు

వరుసగా మూడు విజయాలు సాధించిన ఇంగ్లాండ్‌ 6 పాయింట్లతో గ్రూప్‌ 'ఎ' టాపర్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా రెండు పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. బంగ్లాదేశ్‌ మూడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఇంగ్లాండ్‌ తర్వాత గ్రూప్ ఏ నుంచి రెండో సెమీఫైనల్‌ బెర్తుని దక్కించుకున్న జట్టుగా నిలిచింది.

Champions Trophy: Ben Stokes hits century as England eliminate Australia

శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 278 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 40.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మిగతా ఆట సాధ్యం కాలేదు. ఆట నిలిచిపోయే సమయానికి డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌ 4 వికెట్లకు 200 పరుగులు చేస్తే సరిపోతుంది.

అయితే అప్పటికే 40 పరుగులు ముందంజలో ఉన్న ఇంగ్లాండ్‌‌ని అంఫైర్లు విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్(102 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కగా, కెప్టెన్ మోర్గాన్(87) అర్ధసెంచరీ చేయడంతో కీలకపాత్ర పోషించారు. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

ఆసీస్ బౌలర్లు స్టార్క్, హాజెల్‌వుడ్‌ ధాటికి ఆరు ఓవర్లలోపే రాయ్‌ (4), హేల్స్‌ (0), రూట్‌ (15) పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వర్షం అంతరాయంతో దాదాపుగా గంటసేపు మ్యాచ్‌ ఆగిన అనంతరం మోర్గాన్, బెన్ స్టోక్స్‌ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడారు. అయితే 32వ ఓవర్‌లో స్టోక్స్‌ సింగిల్‌ కోసం ముందుకురాగా ఆలస్యంగా స్పందించిన మోర్గాన్‌.. జంపా విసిరిన అద్భుత త్రోకు రనౌట్‌ అయ్యాడు.

దీంతో నాలుగో వికెట్‌కు ఇంగ్లాండ్ 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆ తర్వాత 108 బంతుల్లో స్టోక్స్‌ సెంచరీతో జట్టుని ఆదుకున్నాడు. ఈ సమయంలో మరోసారి వర్షం ఆటంక పరచడంతో మ్యాచ్‌ వీలు కాలేదు. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన బెన్ స్టోక్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ట్రావిస్‌ హెడ్‌ (64 బంతుల్లో 71 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆరోన్‌ ఫించ్‌ (64 బంతుల్లో 68; 8 ఫోర్లు), స్మిత్‌ (77 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
England had been reduced to 6-2 and then 35-3 chasing 278 to win, as Australia's pace attack threatened to take the game away.
Please Wait while comments are loading...