ఫైనల్లో భారత్-పాక్?: జూన్ 18న ఫాదర్స్ డే, ట్విట్టర్‌లో 'బేటా' అంటూ ట్రోల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పైనల్‌కు చేరింది. దీంతో క్రికెట్ అభిమానులు ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడాలని కోరుకుంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే జూన్ 18(ఆదివారం) ఫాదర్స్ డే రోజున జరిగే పైనల్లో పాక్‌ను ఢీకొడుతుంది.

లండన్‌లోని ది ఓవల్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభం కానుంది. తొలిసారి సెమీ పైనల్‌కు చేరుకున్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించాలని బంగ్లా అభిమానులు పెద్ద ఎత్తున పూజులు చేస్తున్నారు.

అంతేకాదు ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి పైనల్‌కు చేరి చరిత్ర సృష్టిస్తుంది. టోర్నీలో అసాంతం అద్భుత ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఫైనల్లో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు జోకులు వేస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 4న జరిగిన తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

జూన్ 18 ఫాదర్స్ డే

'ఫాదర్స్ డే రోజున తండ్రి, కుమారుడిని కలవాలని కోరుకుంటున్నాడు' అనే కామెంట్‌తో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మహేంద్ర సింగ్ ధోని కూర్చుని ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ట్విట్టర్‌లో అప్పుడే #IndvsPak హ్యాష్ ట్యాగ్

ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ ఫలితం తేలకముందే ట్విట్టర్‌లో #IndvsPak హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేస్తోంది.

1947 రీలోడెడ్

పాకిస్థాన్ చేతిలో ఓటిమి పాలై టోర్నీ నుంచి ఇంగ్లాండ్ నిష్క్రమించడంతో 1947 రీలోడెడ్ అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ఫాదర్స్ డే బహుమతి

ఫాదర్స్ డే రోజున టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని బహుమతిగా ఇస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fans have started trolling Pakistan team after they reached the ICC Champions Trophy 2017 final yesterday (June 14). They are expecting and India-Pakistan title decider on Sunday (June 18) and the former losing.
Please Wait while comments are loading...