కోహ్లీ వింత సంబరం: ముగ్దులైన ఫ్యాన్స్, హోరెత్తిన ట్విట్టర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఏది చేసినా అభిమానులు దానిని నిశితంగా గమనిస్తుంటారు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ వింతగా సంబరాలను జరుపుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెండు పరుగుల తేడాతో రెండు వికెట్లు కోల్పోయింది.

తమీమ్‌ ఇక్బాల్‌ (70) అవుటైన తర్వాత క్రీజులో వచ్చిన షకిబ్‌ అల్‌ హసన్‌ (15) జట్టు స్కోరు 177 వద్ద జడేజా బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కాసేపటికే 61 పరుగులు చేసిన ముష్పికర్ రహీం జాదవ్ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ తన నాలుకని బయట చాపి అదోలా ముష్పికర్ రహీం వైపు చూస్తూ కుప్పిగంతులు వేశాడు.

Champions Trophy: Fans love Virat Kohli's tongue out celebrations

ఈ సంఘటన జరిగినప్పుడు బంగ్లాదేశ్ జట్టు స్కోరు 179 పరుగులు. అంతకముందు 39 ఓవర్‌ వేసిన పాండ్యా బౌలింగ్‌లో మహ్మదుల్లా ఇచ్చిన క్యాచ్‌ను అశ్విన్‌ బౌండరీ వద్ద వదిలేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కోహ్లీ వింత ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోహ్లీ వింత ప్రవర్తనపై సోషల్ మీడియాలో ఇలా:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Whatever India captain Virat Kohli does on the field, it attacts huge attention. It was no different when fans saw a different kind of celebrations from him during India's Champions Trophy semi-final against Bangladesh today (June 15).
Please Wait while comments are loading...