ఫైనల్లో ఇదొక్కటే ఊరట: గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు ఊరట కలిగించే విషయం ఏదైనా ఉందంటే అది పాండ్యా రికార్డు మాత్రమే. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్‌ నెలకొల్పిన రికార్డును హార్దిక్‌ పాండ్యా బద్దలు కొట్టాడు. ఆదివారం ది ఓవల్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ఈ రికార్డుని సాధించాడు.

ఐసీసీ టోర్నమెంట్‌ ఫైనల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా పాండ్యా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.

డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్ శర్మ

డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్ శర్మ

పాక్ పేసర్ ఆమీర్ బౌలింగ్లో తొలి ఓవర్లోనే ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, యువరాజ్, ధావన్, ధోని, కేదార్ జాదవ్‌లు స్వప్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.

హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్

హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు భారత అభిమానుల్లో గెలుపు ఆశలు రేపాడు. ఫాక్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని 32 బంతుల్లో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఉన్నంతసేపూ విధ్వంసక బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

హ్యాట్రిక్ సిక్సర్లు

హ్యాట్రిక్ సిక్సర్లు

షాదాబ్‌ వేసిన ఒక ఓవర్లో అయితే వరుసగా 6, 6, 6 సిక్సర్లు బాది ఆ తర్వాత మరో 4 బాదాడు. హ్యాట్రిక్‌ సిక్సర్లతో అర్ధసెంచరీని సాధించాడు. ఈ క్రమంలో పాండ్యా గెలిపించేస్తాడన్న ఆశలేమీ కలగకపోయినా సెంచరీ అయినా కొడతాడని, పాక్ చేతిలో ఓటమి అంతరాన్ని తగ్గిస్తాడని అభిమానులంతా ఆశించారు.

అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్

అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌట్

అయితే 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా సింగిల్‌ కోసం పిలవడంతో అనవసర పరుగు కోసం ప్రయత్నించి పాండ్యా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే, తాజా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కి ముందు ఐసీసీ టోర్నీ ఫైనల్‌లో అత్యంత వేగంగా 50 పరుగులు సాధించిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన గిల్‌క్రిస్ట్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.

గిల్‌క్రిస్ట్‌ రికార్డు బద్దలు

గిల్‌క్రిస్ట్‌ రికార్డు బద్దలు

1999లో ఐసీసీ నిర్వహించిన వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై గిల్‌క్రిస్ట్‌ 33బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే తాజాగా పాకిస్థాన్‌తో ది ఓవల్ వేదికగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో పాండ్యా 32 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి గిల్‌క్రిస్ట్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The only good that happened to India in the Champions Trophy 2017 final was Hardik Pandya slamming the fastest fifty in ICC event final.
Please Wait while comments are loading...