కోహ్లీనే టార్గెట్: అమీర్‌తో పాక్ బలం పెరిగింది, తీవ్ర కసరత్తులు

Subscribe to Oneindia Telugu

లండన్: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుంటామని పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అమీర్ అన్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం(జూన్ 18న) ఫైనల్‌ జరగనున్న విషయం తెలిసిందే.

'డబుల్' ధమాకా: డోంట్ మిస్ సూపర్ సండే! భారత్-పాక్ ఫైనల్, సెమీ ఫైనల్

ఈ సందర్భంగా పాకిస్థాన్‌ స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ మైండ్‌ గేమ్‌ మొదలెట్టినట్లు తెలుస్తోంది. టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన తొలి సెమీఫైనల్లో వెన్నునొప్పి కారణంగా ఆమిర్‌ దూరమైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఫైనల్‌కి సిద్ధమయ్యాడు. అమీర్‌ చేరికతో పాక్‌ బౌలింగ్‌ మరింత బలంగా మారనుంది.

భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్: 30సెకన్ల యాడ్‌కే రూ. కోటి, పంట పండినట్లే..!

టార్గెట్ కోహ్లీ

టార్గెట్ కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌గా తొలి ఐసీసీ టోర్నమెంట్‌ ఫైనల్‌ ఆడుతోన్న విరాట్‌ కోహ్లీపైనే ఒత్తిడి అధికంగా ఉంటుందన్నారు. అతన్ని వీలైనంత త్వరగా పెవిలియర్‌ బాట పట్టించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమిర్‌ తెలిపాడు. కోహ్లీ వికెట్‌ తీసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా అమీర్‌ తెలిపాడు.

పాక్‌కి అమీర్ కీలకమే

పాక్‌కి అమీర్ కీలకమే

టోర్నీలో భాగంగా తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయిన ఆమిర్‌.. లంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టడమే కాక 28పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తీవ్రంగా శ్రమిస్తున్న పాక్

తీవ్రంగా శ్రమిస్తున్న పాక్

ఛాంపియన్స్‌ ట్రోఫీని దక్కించుకోవడానికి పాకిస్థాన్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఓవల్‌ మైదానంలో జరిగే ఫైనల్‌ కోసం కార్డిఫ్‌ నుంచి పాకిస్థాన్‌, బర్మింగ్‌హామ్‌ నుంచి భారత్‌ లండన్‌ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓవల్‌ మైదానంలో నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో పాక్‌ ఆటగాళ్లు పాల్గొన్నారు. కోచ్‌ ఆధ్వర్యంలో ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో ముమ్మర కసరత్తులు చేశారు. అనంతరం కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, కోచ్‌ కలిసి పిచ్‌ని పరిశీలించారు.

భారత్‌కు అనుకూలమే..

భారత్‌కు అనుకూలమే..

టోర్నీలో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య ఇదే మైదానంలో జరిగిన లీగ్‌లో భారత్‌ 7వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కి దూసుకెళ్లింది. కాగా, ఈ టోర్నీలో పాక్‌కు ఓవల్‌ మైదానంలో ఆడిన అనుభవం లేకపోవడమూ భారత్‌కు కలిసి వచ్చే అంశమే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ahead of the ICC Champions Trophy 2017 final against India, Pakistan paceman Mohammad Amir has resorted to mind games and has targetted captain Virat Kohli.
Please Wait while comments are loading...