'థాంక్యూ జెంటిల్‌ మ్యాన్': పాకిస్థానీయుల మనసు గెలిచిన కోహ్లీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలసిందే. దీంతో మ్యాచ్ అనంతరం నిర్వహించే మీడియా సమావేశంలో తొలిసారి ఐసీసీ టోర్నీ ఫైనల్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించిన కోహ్లీ ఏమి మాట్లాడతాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత ఓటమికి ప్రధాన కారణం

'తుది ఫలితం మాకు నిరాశ కలిగించినా ఫైనల్‌ చేరడం సంతృప్తినిచ్చింది. మేం ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోలేదు కానీ పాకిస్తాన్‌ మరింత పట్టుదలతో ఆడింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లో కూడా వారు దూకుడు కనబర్చారు. తమదైన రోజున పాక్‌ ఎవరినైనా ఓడించగలదని మళ్లీ రుజువైంది. టోర్నీలో వారు కోలుకున్న తీరు అద్భుతం' అని అన్నాడు.

నోబాల్‌లాంటి చిన్న పొరపాట్లే మ్యాచ్‌ని మార్చేశాయి

నోబాల్‌లాంటి చిన్న పొరపాట్లే మ్యాచ్‌ని మార్చేశాయి

'ఇక హార్దిక్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బుమ్రా నోబాల్‌లాంటి చిన్న పొరపాట్లు కూడా ఒక్కోసారి పెద్దగా మారిపోతాయి. మా బలం (ఛేజింగ్‌)పై నమ్మకముంది. కానీ ఈసారి అది సరిపోలేదు. అయితే మేం ఓడింది ఒక్క మ్యాచ్‌ మాత్రమే. తప్పులు సరిదిద్దుకొని ముందుకు వెళతాం' అని కోహ్లీ అన్నాడు.

ఫైనల్లో విజయం సాధించిన పాక్‌కు అభినందనలు

ఫైనల్లో విజయం సాధించిన పాక్‌కు అభినందనలు

'ఫైనల్లో విజయం సాధించిన పాక్‌కు అభినందనలు. అన్ని పరిస్థితులు వారికి అనుగుణంగా మారిపోయాయి. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. ఓడినందుకు బాధగా ఉన్నా.. మంచి పోరాట ప్రదర్శనతో టోర్నీలో ఫైనల్‌ చేరుకున్నాం. మేం కొంత నిరుత్సాహపడిన ఇప్పటికీ నా ముఖంలో చిరునవ్వుందంటే కారణం మేం ఫైనల్‌కు చేరడం సంతృప్తి నిచ్చింది' అని కోహ్లీ తెలిపాడు.

పాక్‌ను తక్కువ అంచనా వేయలేదు

పాక్‌ను తక్కువ అంచనా వేయలేదు

'పాక్‌ను తక్కువ అంచనా వేయలేదు. ఫకార్ జమాన్ లాంటి ఆటగాళ్లకు ఒక రోజంటూ వచ్చినప్పుడు వారిని అపడం కష్టమవుతుంది. ఎందుకంటే అతడు ఆడిన 80 శాతం షాట్లు కూడా హై రిస్క్‌తో కూడుకున్నవి. ఒక బౌలర్‌గా, కెప్టెన్‌గా ఇలాంటిది జరుగుతున్నప్పుడు కలిసొచ్చే రోజున దేన్నయినా మార్చేందుకు ఈ ఒక్కడు చాలేమో అనిపిస్తుంది' అని కోహ్లీ తెలిపాడు.

కోహ్లీ స్పీచ్‌కు పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఫిదా

కెప్టెన్ హోదాలో కోహ్లీ ఇచ్చిన స్పీచ్‌కు పాక్‌ క్రికెట్‌ అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా పాక్‌కు చెందిన పలువురు ప్రముఖులు కోహ్లీ మాటలు విని సంతోషం వ్యక్తం చేశారు. 'మ్యాచ్‌ అనంతరం మాటలతో మా హృదయాలను గెలుచుకున్న కోహ్లీకి ధన్యవాదాలు. నువ్వు గొప్ప ఆటగాడివి. జెంటిల్‌మెన్‌వి కూడా' అంటూ ముబాషిర్‌ లక్మన్‌, సినీ దర్శకుడు ట్విట్టర్‌లో ప్రశంసించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Praising Pakistan for their brilliant all-round performance in the Champions Trophy final here on Sunday (June 18), Indian skipper Virat Kohli said the green brigade can upset any team on their day.
Please Wait while comments are loading...