పాక్‌తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్‌పైనే ఒత్తిడి

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: ఆదివారం ఓవల్‌లో పాకిస్తాన్‌తో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ అజర్ మహమూద్ అన్నారు. తొలి సెమీ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ ఆతిథ్య జట్టు ఇంగ్లాండును పాకిస్తాన్ మట్టి కరిపించి ఫైనల్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు పాకిస్తాన్, భారత్ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కోసం ఫైనల్‌లో ఆదివారం తలపడబోతున్నాయి. ఈ స్థితిలో మహమూద్ మాట్లాడారు. మ్యాచు ఫలితం ఎలా ఉన్నా తమకు పోయేదేమీ లేదని, భారత్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని అన్నారు.

Champions Trophy final: 'Pressure is more on India'

తాము విజయం సాధించడానికి వచ్చామని, చరిత్ర మారుతుందని, దాన్ని తాము మార్చబోతున్నామని ఆయన అన్నారు. ఇంగ్లాండు, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్‌ కన్నా పాకిస్తాన్, భారత్ వైరం పెద్దదని ఆయన అన్నారు.

పాక్, భారత దేశాల్లో తమ తమ అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, క్రేజీ కూడా ఎక్కువేనని అన్నారు. 2007 తర్వాత ఐసిసి టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తొలిసారి తలపడబోతున్నాయి. 2007లో జోహెన్స్‌బర్గ్‌లో ట్వంటీ20 ఫైనల్ మ్యాచులో ఇరు దేశాలు తలపడ్డాయి. ఆ మ్యాచును ధోనీ నాయకత్వంలోని టీమిండియా ఐదు పరుగుల తేడాతో గెలుచుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan's bowling coach Azhar Mahmood feels India will be under more pressure in the ICC Champions Trophy 2017 final tomorrow (June 18) here at The Oval.
Please Wait while comments are loading...