షోయబ్ మాలిక్ జోక్: పడిపడి నవ్విన కోహ్లీ, యువీ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ పైనల్‌కు చేరుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు 'మేం ఇంగ్లాండ్‌ వెళ్తున్నది కేవలం భారత్‌ను ఓడించడానికి మాత్రమే కాదు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకోవడానికి' అని టోర్నీకి ముందు పాక్ ఛీప్‌ సెలెక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ చెప్పిన మాటలు కూడా ఎవ్వరూ నమ్మి ఉండరు.

'థాంక్యూ జెంటిల్‌ మ్యాన్': పాకిస్థానీయుల మనసు గెలిచిన కోహ్లీ

టోర్నీ ప్రారంభానికి ముందు వన్డే ర్యాంకుల్లో 8వ స్ధానంలో ఉన్న పాకిస్తాన్ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది. టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్లో 124 పరుగుల తేడాతో ఓడిపోయినప్పుడు పాక్‌ ఆశలు దాదాపు ఆవిరైపోయాయి.

ఆ తర్వాత అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఫైనల్‌కి దూసుకొచ్చిన తీరు అద్భుతం. టోర్నీ మొత్తం మీద ఏ జట్టు చేతిలో అయితే ఓడిపోయిందో అదే జట్టుపై 180 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పాకిస్తాన్ ఛాంపియన్స్‌గా నిలిచింది. తొలిసారిగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని ముద్దాడింది.

Champions Trophy Final: Video: Virat, Yuvraj share a light moment with Shoaib Malik

ఐసీసీ మూడు ప్రపంచ టైటిళ్లను నెగ్గిన వెస్టిండీస్‌, భారత్‌, శ్రీలంక సరసన నిలిచింది. ఫైనల్లో అనిశ్చితికి మారుపేరైన పాక్‌ మ్యాచ్‌ ఆద్యంతం తిరుగులేని పట్టుదల ప్రదర్శిస్తే, అద్భుతమైన బ్యాట్స్ మెన్లతో నిండిన భారత్ మాత్రం పేలవమైన ఆటతీరుతో భారీ మూల్యం చెల్లించుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత ఓటమికి ప్రధాన కారణం

పాక్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. ఒకరి వెనక ఒకరు పెవిలియన్‌ బాటపట్టారు. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌కు కనీసం పోటీ ఇవ్వకుండా ఓటమి పాలవ్వడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అభిమానులు ఎలా ఉన్నా ఆటగాళ్లకు మాత్రం గెలుపోటములు ఒకటే.

మ్యాచ్ అనంతరం భారత్, పాక్‌కు చెందిన ఆటగాళ్లు ఏదో విషయంపై చర్చిస్తూ నవ్వుతూ కనిపించారు. పాకిస్థాన్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, అజార్ మహ్మాద్‌లు ఏదో విషయం గురించి చెప్తుంటే భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లు పగలపడి నవ్వారు.

పాక్‌తో ఫైనల్: భారత్ భారీ మూల్యం, మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే

ఇదిలా ఉంటే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భారత్‌కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అద్భుతమైన మూమెంట్‌ని ఐసీసీ వీడియో రూపంలో చిత్రీకరించి అభిమానుల కోసం ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అదేంటో మీరు కూడా చూడండి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Whenever India and Pakistan lock horns, be it in a bilateral series or in an ICC event, passion and aggression ooze out from both the camps.
Please Wait while comments are loading...