‘నేను మంచి కెప్టెన్‌, నా కెప్టెన్సీలో వరల్డ్‌ కప్‌ అందిస్తా'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెత్త ఆటతీరుని ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం డివిలియర్స్ మీడియాతో మాట్లాడాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు | స్కోరు కార్డు

'మేం చాలా చెత్తగా ఆడాం. ఇలా ఆడితే మ్యాచ్‌లను ఫినిష్‌ చేయలేం. ఎంతో నిరాశ చెందాను. మొదటి 15-20 ఓవర్లలోనే టీమిండియా పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌ క్రెడిట్‌ వాళ్లదే. అద్భుత ప్రదర్శన చేశారు. ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టకుండా ఆడారు' అని ఏబీ చెప్పాడు.

 Champions Trophy: I'm a good captain, I can take South Africa to win a World Cup, says de Villiers

అదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధవాన్ 78, కోహ్లీ 76(నాటౌట్), యువరాజ్ సింగ్ 23(నాటౌట్), రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు. అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా 44.3 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

'నేను మంచి కెప్టెన్‌. జట్టును ముందుండి నడిపించగలను. నా సారథ్యంలో వరల్డ్‌ కప్‌ విజయాన్ని అందించగలనని అనుకుంటున్నా. ఈ టోర్నీలో ఏ జరిగిందనేది ఇక్కడితోనే ముగిసిపోయింది. ఇకముందు మెరుగ్గా రాణిస్తాం' అని డివిలియర్స్‌ చెప్పాడు.

దక్షిణాఫ్రికాపై తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరగా, దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి వైదొలగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ పైనల్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With yet another early exit from the Champions Trophy 2017, South African captain AB De Villiers has insisted that despite the team's poor performance in the tournament, he can lead the team to a World Cup victory in 2019.
Please Wait while comments are loading...