భారత్‌పై ప్రతీకారానికి గోల్డెన్ చాన్స్: ఇమ్రాన్ ఖాన్ కసి

Posted By:
Subscribe to Oneindia Telugu

కరాచీ: భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి పాకిస్తాన్‌కు సువర్ణావకశాం వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ అన్నారు. టోర్నమెంట్‌లోని తొలి మ్యాచులో ఓటమికి పాకిస్తాన్ భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఫైనల్ మ్యాచ్ సువర్ణావకాశమని ఆయన అన్నారు.

మన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఫైనల్ గొప్ప అవకాశాన్ని కల్పించిందని ఆయన అన్నారు. సమా టెలివిజన్ చానెల్ కార్యక్రమంలో ఆయన ఆ మాటలన్నారు. మొదటి మ్యాచులో అత్యంత అవమానకరంగా ఓడిపోయామని, ఇప్పుడు పరిస్థితిని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చునని అన్నారు.

ఫైనల్ మ్యాచులో టాస్ గెలిస్తే భారత్‌కు మొదట బ్యాటింగ్ అప్పగించవద్దని ఆయన పాిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు సూచించారు. ఇండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందని, తొలుత భారత్ బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే మనం ఒత్తిడికి గురవుతామని ఆయన అన్నారు.

Champions Trophy: Imran Khan wants Pakistan to do this against India in final

ఇతర దేశాల జట్లతో ఆడుతున్నప్పుడు కూడా మొదట ఫీల్డింగ్ చేయాలనే సర్ఫరాజ్ వ్యూహం ఫలితాన్ని ఇచ్చిందని, మధ్యలో స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారని, హసన్ అలీ చాలా బాగా బంతులు వేశాడని ఆయన అన్నారు. మన నిజమైన బలం మన బౌలింగేనని, టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయడమే మంచిదని, మన బౌలింగ్ ఉన్నంత బాగా బ్యాటింగ్ లేదని అన్నారు. సర్ఫరాజ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. సర్ఫరాజ్ కెప్టెన్సీ తనకు బాగా నచ్చిందని, బోల్డ్ కెప్టెన్ అని అన్నారు.

ఫైనల్ మ్యాచు ద్వారా పాకిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక మ్యాచులకు ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని జావెద్ మియందాద్ అన్నారు. రాజకీయ అంశాలను పక్కన పెట్టి ఇరు దేశాలు ఎక్కువ క్రికెట్ ఆడాలని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక మ్యాచులు ప్రారంభం కావాలని ఆయన అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former World Cup winning captain, Imran Khan said Pakistan have got a golden opportunity in the Champions Trophy final to avenge its humiliating defeat to India in their first match of the tournament.
Please Wait while comments are loading...