ట్విట్టర్‌లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ది ఓవల్ వేదికగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన పైనల్ సోషల్ మీడియాలో అరుదైన రికార్డును సాధించింది. పైనల్ మ్యాచ్‌కి సంబంధించిన సమాచారాన్ని నెటిజన్లు రికార్డు స్థాయిలో ట్వీట్ చేసినట్లు ఆసియా పసిఫిక్‌ స్పోర్ట్స్‌ పార్ట్‌నర్‌షిప్‌ ట్విటర్‌ హెడ్‌ అనీశ్‌ మదాని వెల్లడించారు.

అంతేకాదు ఈ మ్యాచ్‌ని 'మదర్ ఆఫ్ ఆల్ ఫైనల్స్' గా కూడా ఆయన అభివర్ణించారు. భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ రికార్డు స్థాయిలో 1.8 మిలియన్ల ట్వీట్లు నమోదయ్యాయని, గతంలో ఐసీసీ నిర్వహించిన ఏ వన్డేకి ఇంత స్థాయిలో ట్వీట్లు నమోదు కాలేదని ఆయన తెలిపారు.

Champions Trophy: India-Pakistan final sets all-time record on Twitter

ఐసీసీ వన్డే చరిత్రలోనే అత్యధిక ట్వీట్లు నమోదైన మ్యాచ్‌గా ఆదివారం జరిగిన భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2013లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీతో పోల్చితే ఈ ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ జరిగిన సమయంలో ఐసీసీ ట్విటర్‌ ఖాతాను ఫాలో అయిన వారి సంఖ్య నాలుగు రెట్లు అధికంగా ఉందని అన్నారు.

ఆదివారం మ్యాచ్ జరిగిన సమయంలో ట్విట్టర్‌లో #CT17, #INDvPAK హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయని తెలిపారు. ఈ మ్యాచ్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, లైవ్‌ అప్‌డేట్స్‌, ఆటగాళ్ల ఇంటర్వ్యూలు తదితర సమాచారాన్ని ఐసీసీ అభిమానులతో పంచుకుంది.

వీటితో పాటు కొత్తగా చాట్ బాట్ డైరెక్ట్ మెసేజ్ లను కూడా ట్విట్టర్ విడుదల చేసింది. వీటితో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌పై తమ అభిప్రాయాలను పంచుకోవడం, విజేతగా నిలిచిన జట్టును అభినందించడం లాంటి వాటిని హ్యాష్ ట్యాగ్‌లను జత చేసి చేశారు.

ఈ టోర్నీలో ట్విటర్‌ ద్వారా తొలి ఐదు స్థానాలు దక్కించుకున్న మ్యాచ్‌ల వివరాలు:
1. భారత్ Vs పాకిస్థాన్‌(ఫైనల్‌)
2. భారత్‌ Vs పాకిస్థాన్‌
3. భారత్‌ Vs దక్షిణాఫ్రికా
4. భారత్‌ Vs బంగ్లాదేశ్‌
5. ఇంగ్లాండ్‌ Vs పాకిస్థాన్‌(తొలి సెమీఫైనల్‌)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The ICC Champions Trophy 2017 final between India and Pakistan on Sunday (June 18) has set an all-time record on the micro-blogging website Twitter.
Please Wait while comments are loading...