సెమీ ఫైనల్ 2, భారత్ Vs బంగ్లా: గత ఐసీసీ టోర్నీల్లో భారత విజయ పరంపర

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2007 ముందు వరకు బంగ్లాదేశ్ అంటే ప్రపంచ క్రికెట్‌లో పసికూన. అలాంటి పసికూన చేతిలో ఓటమి పాలవడంతో 2007 వరల్డ్ కప్‌లో టీమిండియా గ్రూప్‌ దశలో టోర్నీ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. క్రికెట్‌లో పసికూన అయిన బంగ్లాదేశ్ తెగువకు, పోరాటానికి పెట్టింది పేరు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు | స్కోరు కార్డు 

గతంలో ఒకటి, రెండుసార్లు భారత్‌పైనే దానిని నిరూపించుకున్నారు. అంతేకాదు ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేస్ అనూహ్య ప్రదర్శనను కనబరుస్తూ ఉంటుంది. అందుకు ఉదాహరణే ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ. అంచనాలే లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టోర్నీలో తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనా ఆ తర్వాత న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్‌ చేరింది. ఈ క్రమంలో జూన్ 15(గురువారం)న సెమీస్‌లో టీమిండియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏ రకంగా చూసినా.. ఏ అంశంలోనూ పోల్చినా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్ అన్నది అందరికీ తెలిసిందే.

ఆటపరంగా, రికార్డులపరంగా బంగ్లాకు అందనంత ఎత్తులో టీమిండియా ఉంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పోరాట పటిమను అభినందించకుండా ఉండలేం. ఎందుకంటే 2017 ప్రపంచకప్‌లో ఆ జట్టు టీమిండియాను ఓడించింది. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లాను తేలిగ్గా తీసుకుంటే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఇప్పటివరకు బంగ్లాదేశ్‌తో ఆడిన 32 వన్డేల్లో భారత్‌ 26 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌-బంగ్లా మ్యాచ్ విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే:

2007 వరల్డ్ కప్ (7 వికెట్లతో బంగ్లాదేశ్ విజయం)

2007 వరల్డ్ కప్ (7 వికెట్లతో బంగ్లాదేశ్ విజయం)

ఈ వరల్డ్ కప్‌లో టీమిండియా అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చింది. కోచ్‌ గ్రెగ్‌ ఛాపెల్‌ వివాదాలతో దాదా బృందం గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 191 పరుగులకు కుప్పకూలింది. గంగూలీ (66), యువీ (47) మినహా ఎవ్వరూ రాణించలేదు. తమీమ్‌ ఇక్బాల్‌ (51), ముష్ఫికర్‌ రహీమ్‌ (56), షకిబ్‌ (53) అద్భుత పోరాటంతో బంగ్లా విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్ 2009 (25 పరుగుల తేడాతో టీమిండియా విజయం)

టీ20 వరల్డ్ కప్ 2009 (25 పరుగుల తేడాతో టీమిండియా విజయం)

ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగింది. గౌతం గంభీర్‌ (50), యువీ (41) బ్యాటింగ్‌తో ధోని సేన 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ప్రజ్ఞాన్‌ ఓజా (4/21) అద్భుత బౌలింగ్‌తో బంగ్లా 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

వరల్డ్ కప్ 2011 (87 పరుగుల తేడాతో టీమిండియా విజయం)

వరల్డ్ కప్ 2011 (87 పరుగుల తేడాతో టీమిండియా విజయం)

ఈ టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. భారత్‌ రెండోసారి ప్రపంచకప్‌ గెలిచింది. సెహ్వాగ్‌ (175), విరాట్‌ కోహ్లీ (100) సెంచరీలతో ధోనీసేన 370 పరుగులు చేసింది. మునాఫ్‌ పటేల్‌ (4/48) అద్భుత బౌలింగ్‌తో బంగ్లా 284 పరుగులకు కుప్పకూలింది. ఈ వరల్డ్ కప్‌లో తొలి ప్రారంభ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

టీ20 వరల్డ్ కప్ 2014 (8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం)

టీ20 వరల్డ్ కప్ 2014 (8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం)

మీర్పూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాను ఓడించి టీమిండియా సెమీస్‌ చేరింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (4-0-15-2), అమిత్‌ మిశ్రా (4-0-36-3)ల అద్భుత బౌలింగ్ దెబ్బకు బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన టీమిండియా రోహిత్‌ శర్మ (56), కోహ్లీ (57 నాటౌట్‌) రాణించడంతో టీమిండియా 9 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

వరల్డ్ కప్ 2015 (టీమిండియా విజయం)

వరల్డ్ కప్ 2015 (టీమిండియా విజయం)

ఈ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. ఆ తర్వాత టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. రోహిత్‌ (137), సురేశ్‌రైనా అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌ నిర్ణీత 6 వికెట్లు కోల్పోయి ఓవర్లలో 302 పరుగులు చేసింది. అనతంరం ఛేదనలో బంగ్లాదేశ్ 33కే రెండు వికెట్లు నష్టపోయి తడబడింది. చివరకు 193 పరుగులకు ఆలౌటైంది.

టీ20 వరల్డ్ కప్ 2016 (ఒక్క పరుగుతో టీమిండియా విజయం)

టీ20 వరల్డ్ కప్ 2016 (ఒక్క పరుగుతో టీమిండియా విజయం)

ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిన బంగ్లాదేశ్ అనవసర తప్పిదాలతో ఓటమి పాలైంది. చివరి ఓవర్ 6 బంతుల్లో బంగ్లా విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. బంగ్లా బ్యాట్స్‌మెన్లు మహ్మదుల్లా, ముష్ఫికర్‌ రహీమ్‌ క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను హార్దిక్‌ పాండ్యా చేత ధోని వేయించాడు. తొలి బంతికి సింగిల్‌, రెండో బంతికి, మూడో బంతి ముష్ఫికర్‌ బౌండరీలు బాదాడు. బంగ్లా ముందస్తుగా సంబరాలు చేసుకొంది. కానీ వారికి ఊహించని షాక్‌ తగలింది. చివరి 3 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి ఉండగా నాలుగో బంతికి రహీమ్‌ అవుటయ్యాడు. ఐదో బంతికి మహ్మదుల్లా పెవిలియన్‌కు చేరాడు. చివరి బంతికి పరుగు తీస్తుండగా ధోనీ ముస్తాఫిజుర్‌ను రనౌట్‌ చేశాడు. దీంతో టీమిండియా బంగ్లాపై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Until 2007, an India v Bangladesh encounter in a major limited-overs tournament would have been scoffed at. It would have been seen as a hopeless match for Bangladesh and an easy few points to be pocketed for India.
Please Wait while comments are loading...