దక్షిణాఫ్రికాపై భారత్ విజయం: సెమీస్‌లో బంగ్లాతో ఢీ, మ్యాచ్ హైలెట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరింది. టోర్నీలో భాగంగా అదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.

Virat Kohli

భారత బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధవాన్ 78, కోహ్లీ 76(నాటౌట్), యువరాజ్ సింగ్ 23(నాటౌట్), రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు. అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాప్రికా 44.3 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

తాజా విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరగా, దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి వైదొలగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ పైనల్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. సోమవారం పాక్, శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది.

టీమిండియా విజయ లక్ష్యం 192

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం ది ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా విజృంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను ఏ దశలోనూ సఫారీలను తేరుకోనీయకుండా చేసి భారత్ పైచేయి సాధించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు 

దీంతో 44.3 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 192 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కనీసం రెండొందల మార్కును కూడా దాటలేకపోయింది. టీమిండియా కట్టుదిట్టమైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో దక్షిణాఫ్రికాపై చెలరేగారు.

 Highlights: India Vs South Africa

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో డికాక్‌(53), ఆమ్లా(35), డుప్లెసిస్‌(36), డివిలియర్స్‌(16), డుమిని(19) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లెవరూ రెండంకెల స్కోరును చేయలేదు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జాస్ప్రిత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీయగా అశ్విన్, హార్దిక్ పాండ్యా, జడేజా తలో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సెమీస్‌కు చేరనుండగా ఓడిన జట్టు ఛాంపియన్స్ టోర్నీ నుంచి వైదొలగనుంది.

భారత్ Vs దక్షిణాఫ్రికా మ్యాచ్ హైలెట్స్:

* ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
* దక్షిణాఫ్రికా తరుపున డీకాక్, హషీం ఆమ్లా ఓపెనింగ్ చేశారు.
* దక్షిణాఫ్రికా ఓపెనర్లు 10 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు.
* 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమ్లా అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
* తొలి వికెట్‌కు వీరిద్దరూ 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* 68 బంతుల్లో ఓపెనర్ డీకాక్ అర్ధ సెంచరీని సాధించాడు. వన్డేల్లో డీడాక్‌కి ఇది 14వ అర్ధసెంచరీ.
* అర్ధసెంచరీ చేసిన తర్వాత 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో డీకాక్ అవుటయ్యాడు.
* 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఏబీ రనౌట్ అయ్యాడు.
* డివిలియర్స్ అవుటైన తర్వాత డుప్లెసిస్ కూడా రనౌట్ అయ్యాడు.
* అశ్విన్ వేసిన 30వ ఓవర్‌లో డుప్లెసిస్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే మధ్యలో సింగిల్ తీయాలా వద్దా అన్న అయోమయంలో డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్ కలిసి ఒకేసారి బ్యాటింగ్ ఎండ్‌ వైపుకు పరిగెత్తారు.
* దీంతో ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా బంతిని బౌలింగ్ ఎండ్‌కు విసరడంతో దాన్ని అందుకున్న కోహ్లీ వికెట్లను పడగొట్టాడు. ఈ రనౌట్‌ను పరీక్షించిన టీవీ అంపైర్ డేవిడ్ మిల్లర్‌(1)నే అవుట్‌గా ప్రకటించాడు.
* దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ మొత్తం పేకమేడలా కుప్పకూలింది.
* 140 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా ఆ తర్వాత 98 బంతుల్లో 51 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది.
* భారత బౌలర్లలో ప్రతి ఒక్కరూ వికెట్లు తీశారు. భువనేశ్వర్ 2 బంతుల్లో 2 వికెట్లు తీశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A spirited Indian bowling attack restricted South Africa for just 191 runs after Virat Kohli had sent the Proteas to bat first in the match 11 of ICC Champions Trophy 2017.
Please Wait while comments are loading...