అరుదైన కలయిక: ధోని చేతిలో ఉన్న బుడతడు ఎవరు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జూన్ 18 (ఆదివారం) ఫాదర్స్ డే. ఇదే రోజు ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ జరగనుంది. ఈ పైనల్ మ్యాచ్‌లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్ధాన్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యంత అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు 

ఆ ఫోటోలో పాకిస్థాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్ అహ్మద్‌ కుమారుడు అబ్దుల్లాను ఎత్తుకొని ముద్దుచేస్తున్నాడు. ఆదివారం తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుతుండటంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ సంచలనంగా మారింది. మామూలుగా భారత్-పాక్ మ్యాచ్ అంటే అభిమానులకు ఎంతో ఉత్సుకత ఉంటుంది.

అలాంటిది క్రికెట్ ఛాంపియన్స్‌గా నిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ అంటే మాటలా. ఈ మ్యాచ్ ముగిసిన వారం రోజుల పాటు ఈ మ్యాచ్ ప్రభావం ఇరు దేశాల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ధోని పోస్ట్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు భారత, పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులను మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్ఫరాజ్ అహ్మద్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఇదిలా ఉంటే ఇటీవలే ఓ ఇంటర్యూలో సర్ఫరాజ్ మాట్లాడుతూ ధోని అంటే తనకెంతో ఇష్టమని అతడి నుంచి ఎంతో ప్రేరణ పొందినట్లు పేర్కొన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే గ్రూప్ బీలో జూన్ 4వ తేదీన జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్లో మరోసారి ఇరు జట్లు తలపడుతుండటంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ahead of the high tension Champions Trophy 2017 final between rivals India and Pakistan, former Indian captain MS Dhoni got clicked with Pakistani captain Sarfraz Ahmed's baby son.
Please Wait while comments are loading...