'అల్లా దయ వల్లే లంకపై విజయం సాధించాం' (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించి సెమీస్‌కి చేరుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడాడు. అల్లా దయ వల్లే తాము శ్రీలంకపై విజయం సాధించగలిగామని చెప్పాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

ఈ విజయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పాడు. మహ్మద్‌ అమీర్‌(28 నాటౌట్‌, 43బంతుల్లో) చాలా బాగా ఆడాడని కొనియడాడు. కీలక సమయంలో అండగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని చెప్పాడు. స్కోరు గురించి ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎక్కువ సమయం క్రీజులో ఉండే దానిపై దృష్టి పెట్టమని మ్యాచ్‌ మధ్యలో అమీర్‌కి చెప్పానని అన్నాడు.

Champions Trophy: Pakistan players told not to give unsolicited advice to Sarfraz Ahmed

మ్యాచ్‌లో క్యాచ్‌లు చేజార్చడం ఆటలో మాములు విషయమేనని అన్నాడు. ఈ మ్యాచ్‌లో అల్లా మాకు సాయం చేశాడని, అందుకే విజయం సాధించగలిగామని సర్ఫరాజ్‌ తెలిపాడు. మరో ఓపెనర్‌ జమాన్‌(50) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడని, దీంతో అతడు పాక్‌ జట్టులో విలువైన ఆటగాడిగా మారాడని సర్ఫరాజ్ అన్నాడు.

కార్డిఫ్ వేదికగా బుధవారం జరిగే తొలి సెమీస్ పైనల్ మ్యాచ్ గురించి సైతం సర్ఫరాజ్ స్పందించాడు. ఇంగ్లాండ్‌ జట్టు చాలా పటిష్ఠంగా ఉందని, ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగడం ఖాయమని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేసి పైనల్‌కు చేరతామని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Senior members of the Pakistan team, which is currently playing in the ongoing ICC Champions Trophy, have been told not to give any unsolicited advice to captain, Sarfraz Ahmed.
Please Wait while comments are loading...