భారత్‌పై ఒత్తిడి: 'శ్రీలంక గెలిచింది.. బంగ్లాదేశ్ గెలవలేదా?'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో సెమీ పైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదని ఆ జట్టు మాజీ కెప్టెన్లు పేర్కొన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

అంతేకాదు ఆ జట్టు ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. టోర్నీలో భాగంగా లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంకనే విజయం సాధించిందని, అలాంటిది బంగ్లాదేశ్‌ అలవోకగా విజయం సాధిస్తుందని బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అష్రాఫుల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

బుధవారం మీడియాతో మాట్లాడిన బంగ్లా మాజీ కెప్టెన్ అష్రాఫుల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ తీవ్ర ఒత్తిడిలో ఉందని, ఇది బంగ్లాదేశ్‌కు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా విజయం సాధించి ఫైనల్ పోరులో తప్పక నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

శ్రీలంక గెలిచింది.. బంగ్లాదేశ్ గెలవలేదా?

శ్రీలంక గెలిచింది.. బంగ్లాదేశ్ గెలవలేదా?

భారత్‌పై శ్రీలంక విజయం సాధించిందని, అలాంటింది మనం ఎందుకు సాధించలేమని ప్రశ్నించాడు. న్యూజిలాండ్‌పై 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా విజయం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తే మ్యాచ్ రసవత్తరంగా ఉంటుందని అన్నాడు.

సెమీ పైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉంది

సెమీ పైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉంది

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు సెమీస్‌కు చేరని మా జట్టు ఇప్పడు సెమీ పైనల్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. మరోవైపు భారత్‌ పరిస్థితి అలా లేదని డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన భారత్ ఛాంపియన్స్‌గా నిలుస్తారని 130 కోట్ల జనాభా వారిపై ఆశలు పెట్టుకున్నారని చెప్పుకొచ్చాడు.

పవర్‌ ప్లేలో మూడు వికెట్లు తీస్తే గెలవడం సులువు

పవర్‌ ప్లేలో మూడు వికెట్లు తీస్తే గెలవడం సులువు

ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఎలా ఆడితో విజయం సాధిస్తుందో కూడా చెప్పాడు. భారత్‌పై పవర్‌ ప్లేలో మూడు వికెట్లు తీస్తే గెలవడం సులవని అష్రాఫుల్‌ అభిప్రాయపడ్డాడు. ఇక న్యూజిలాండ్‌పై అనూహ్య విజయం సాధించిన బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా దురదృష్టం వెంటాడటంతో బంగ్లా సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే.

ఆసీయా కప్‌ ఫైనల్‌ కూడా వచ్చాం

ఆసీయా కప్‌ ఫైనల్‌ కూడా వచ్చాం

మరో మాజీ కెప్టెన్ హబీబుల్‌ బషీర్‌ ఈ మధ్యకాలంలో మా ఆటతీరు మెరుగైందని, ఆసీయా కప్‌ ఫైనల్‌ కూడా వచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇది బంగ్లా క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టమని, మినీ వరల్డ్‌ కప్‌ వంటి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని బషీర్‌ తెలిపాడు.

భారత్‌పై ఒత్తిడి ఉంటుంది

భారత్‌పై ఒత్తిడి ఉంటుంది

ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. బషీర్‌ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్‌ 2007 వరల్డ్ కప్‌లో టీమిండియాపై సంచలన విజయం నమోదుచేసింది. బంగ్లా చేతిలో ఓటమి పాలవడంతో టీమిండియా అప్పటి వరల్డ్ కప్ లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India may be outright favourites in the Champions Trophy semifinals against Bangladesh but the defending champions will be under more pressure, former captains Mohammad Ashraful and Habibul Bashar said today (June 14).
Please Wait while comments are loading...