ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ షెడ్యూల్: టీవీ సమాచారం, ఏ జట్టు ఎవరితో?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ స్టేజి సమరం ముగిసింది. టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. అయితే సెమీస్‌కు చేరుకున్న నాలుగు జట్లలో మూడు జట్లు ఆసియా జట్లు కావడం విశేషం.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు

టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. గ్రూప్ ఏలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడంతో బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరుకుంది.

https://www.oneindia.com/sports/cricket/champions-trophy-semi-finals-schedule-teams-venues-tv-info-2461398.html

గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు కచ్చితంగా చేరుతుందని భావించిన ఆసీస్‌ను అడుగడుగునా వర్షం అడ్డుకోవడంతో ఒక్క విజయం కూడా లేకుండానే ఇంటిదారి పట్టింది. సెమీస్‌కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో పోటీ పడ్డ మ్యాచ్‌లో సైతం వరుణుడు అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు అశనిపాతమైంది.

డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 40 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచినట్టు అంపైర్లు ప్రకటించడంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వైదొలిగింది. ఆస్ట్రేలియా ఓటమితో బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఏ నుంచి ఇంగ్లాండ్‌తో పాటు, న్యూజిలాండ్‌పై విజయం సాధించిన బంగ్లాదేశ్ సెమీస్‌కు వెళ్లాయి.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. కాగా, లండన్‌లోని ది ఓవల్ స్టేడియంలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్‌కు చేరుకున్న మూడో జట్టుగా టీమిండియా నిలిచింది.

సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్‌ బిలో నాలుగు పాయింట్లతో రెండో స్ధానంలో ఉన్న పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.


సెమీ ఫైనల్ షెడ్యూల్:
జూన్ 14 (బుధవారం) - తొలి సెమీ ఫైనల్
(A1) ఇంగ్లాండ్ Vs (B2) పాకిస్థాన్
3 PM IST (10.30 AM Local, 9.30 AM GMT) - కార్డిప్ వేల్స్ స్టేడియం, కార్డిప్


June 15 (గురువారం) - 2వ సెమీ పైనల్
(A2) బంగ్లాదేశ్ Vs (B1) భారత్
3 PM IST (10.30 AM Local, 9.30 AM GMT) - ఎడ్జిబాస్టన్, బర్మింగ్ హామ్


June 18 (ఆదివారం) - పైనల్
3 PM IST (10.30 AM Local, 9.30 AM GMT) - ది ఓవల్, లండన్

అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం, హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్


అంపైర్లు:

భారత్‌, బంగ్లా మ్యాచ్‌కు రిచర్డ్‌ కెటిల్‌బరో, కుమార ధర్మసేన ఫీల్డ్‌ అంపైర్లుగా ఉంటారు. నిగెల్‌ లాంగ్‌, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ మూడు, నాలుగో అంపైర్లు, క్రిస్‌ బ్రాడ్‌ రిఫరీగా వ్యవహరిస్తారు.

పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు మరైస్‌ ఎరాస్మస్‌, రాడ్‌ టక్కర్‌ ఫీల్డ్‌ అంపైర్లు. క్రిస్‌ గఫానీ, బ్రూస్‌ ఆక్సెన్‌ఫర్డ్‌ మూడు, నాలుగో అంపైర్లుగా ఉంటారు. ఆండీ పైక్రాఫ్ట్‌ రిఫరీగా ఉంటారు.

జూన్‌ 18న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ అంపైర్ల వివరాలు త్వరలో ఐసీసీ ప్రకటించనుంది.


సెమీ ఫైనల్స్‌కు ఎలా చేరాయంటే?
ఇంగ్లాండ్
Beat Bangladesh by 8 wickets (Scorecard)
Beat New Zealand by 87 runs (Scorecard)
Beat Australia by 40 runs (Duckworth/Lewis method) (Scorecard)

ఇండియా
Beat Pakistan by 124 runs (Duckworth/Lewis method) (Scorecard)
Lost to Sri Lanka by 7 wickets (Scorecard)
Beat South Africa by 8 wickets (Scorecard)

బంగ్లాదేశ్
Lost to England by 8 wickets (Scorecard)
No result against Australia (Scorecard)
Beat New Zealand by 5 wickets (Scorecard)

పాకిస్థాన్
Lost to India by 124 runs (D/L method) (Scorecard)
Beat South Africa by 19 runs (D/L method) (Scorecard)
Beat Sri Lanka by 3 wickets (Scorecard)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The semi-final line-up of the ICC Champions Trophy 2017 is complete with three Asian teams in the last-four stage.
Please Wait while comments are loading...