కోహ్లీ Vs జునైద్: చరిత్ర సృష్టించనున్న భారత్-పాక్ మ్యాచ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మరికొన్ని గంటల్లో హైటెన్షన్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నాం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని ది ఓవల్ వేదికగా జరగనుంది.

టోర్నీకే హై టెన్షన్ మ్యాచ్‌గా నిలిచిన ఈ ఫైనల్‌ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు పనులను సైతం వాయిదా వేసుకుంటున్నారు. భారత్-పాక్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ రికార్డులకు ఎక్కనుంది. ప్రపంచవ్యాప్తంగా 32.4 కోట్ల మంది ఈ మ్యాచ్ వీక్షించనున్నట్టు అంచనా వేస్తున్నారు.

మూడో మ్యాచ్‌గా

మూడో మ్యాచ్‌గా

క్రికెట్ చరిత్రలో అతి ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్‌లలో ఇది మూడోది కాబోతోంది. 2011లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ను 55.8 కోట్ల మంది వీక్షించారు. అదే టోర్నీలో భారత్-పాక్ మధ్య జరిగిన సెమీస్ పోరును 49.5 కోట్ల మంది చూశారు. ఈ రెండే ఇప్పటి వరకు ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మూడోది కానుంది.

ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు

ఇక ఈ మ్యాచ్‌కు సంబంధించి మరికొన్ని విశేషాలు

పాకిస్థాన్‌తో జరిగిన గత ఐదు వన్డేల్లో నాలుగింటిని టీమిండియా గెలుచుకుంది. ఇంగ్లండ్‌ గడ్డపై పాక్‌తో జరిగిన పోరులో భారత్ మూడు సార్లు గెలుపొందగా పాక్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం 2-2తో సరిసమానంగా ఉన్నాయి.

భారత్ బ్యాటింగ్‌కు, పాక్ బౌలింగ్‌కు

భారత్ బ్యాటింగ్‌కు, పాక్ బౌలింగ్‌కు

ఈ ఫైనల్‌ను భారత్ బ్యాటింగ్‌కు, పాక్ బౌలింగ్‌కు మధ్య జరిగే పోరుగా అభివర్ణిస్తున్నారు. ఐదేసి వికెట్లు తీసిన బౌలర్లు ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. హసన్ అలీ, జునైద్ ఖాన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధవన్ (317), రోహిత్ శర్మ (304), విరాట్ కోహ్లీ (253) పరుగులతో, అద్భుతమైన స్ట్రయిక్ రేట్‌తో ఉండడం పాక్‌కు కలవరపరిచే అంశం.

కోహ్లీ Vs జునైద్ ఖాన్

కోహ్లీ Vs జునైద్ ఖాన్

భారత్ ఇప్పటికే పలుమార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో పాల్గొంది. పాకిస్థాన్‌తో మాత్రం ఇదే తొలిసారి. 60 శాతం మ్యాచ్‌లలో చేధనలో విజయాలు అందుకుంది. తాజాగా ఆదివారం నాటి ఫైనల్ మాత్రం టీమిండియా కెప్టెన్ కోహ్లీకి పాక్ బౌలర్ జునైద్ ఖాన్‌కు మధ్య పోరు జరగనుంది. జునైద్ ఖాన్ వేసిన 22 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. మూడుసార్లు అతడి బౌలింగ్‌లో కోహ్లీ అవుటయ్యాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Form, rankings, even the bookies, favour India. But Pakistan have improved beyond recognition since captain Kohli's boys mauled them in the group game. Here's why the 2017 Champions Trophy final at the Kennington Oval, London.
Please Wait while comments are loading...