దొంగా.. దొంగా అంటూ: ఓవల్ స్టేడియంలో మాల్యాకు చేదు అనుభవం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ది ఓవల్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లు చూస్తాన‌ని ఇప్ప‌టికే చెప్పిన మాల్యా.. తాజాగా ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సంద‌ర్భంగా ఓవ‌ల్ స్టేడియానికి వ‌చ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

Champions Trophy: Vijay Mallya booed during India-South Africa match in London

ఈ సందర్భంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా అభిమానులు విజయ్ మాల్యా స్క్రీన్ పై కనిపించగానే హేళ‌న చేశారు. దొంగా.. దొంగా.. అంటూ అరిచారు. దీంతో మాల్యాకు మొహం మాడిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సెన్సేషన్‌ న్యూస్: భారత్-పాక్ మ్యాచ్‌కి హాజరవడంపై మాల్యా ఏమన్నాడంటే!

టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కి హాజరైనప్పుడే మాల్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో అత‌ను ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌లూ చూస్తాన‌ని అప్పుడే చెప్పాడు. అంతేకాదు పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ ఫౌండేష‌న్ నిర్వ‌హించిన చారిటీ డిన్న‌ర్‌కు కూడా వచ్చాడు.

అక్క‌డ కూడా భారత ఆటగాళ్లు మాల్యాకి మొహం చాటేసిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని, వాటికి ఎగనామం పెట్టి ప్రస్తుతం లండన్‌లో లగ్జరీ జీవితాన్ని గడుపుతోన్న సంగతి తెలిసిందే.

అయితే విజయ్ మాల్యా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో భారత ఆటగాళ్లు అసౌకర్యంగా ఫీలయ్యారు. అయితే మాల్యా రాక‌ను ముందే తెలుసుకున్న భారత ఆటగాళ్లు మాల్యాకు దూరంగా ఉన్నారు. అన‌వ‌స‌రం వివాదం ఎందుకు అనుకొని.. కాస్త ముందుగానే అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fugitive Indian businessman Vijay Mallya was booed by the Indian fans at The Oval were the India Vs South Africa match in ICC Champions Trophy is going on.
Please Wait while comments are loading...